హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: రైల్వే జోన్ పై వదంతులు నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Breaking News: రైల్వే జోన్ పై వదంతులు నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

విశాఖవాసులకు శుభవార్త

విశాఖవాసులకు శుభవార్త

Breaking News: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దు అన్నారు. అలాగే రైల్వే జోన్ ఉంటుందా.. ఉండదా? ఎలా ఉండబోతోంది అన్నింటిపైనా క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Breaking News: విశాఖ రైల్వే జోన్ (Visakha Railway Zone) పై రెండు రోజుల నుంచి ఓ ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖకు రైల్వే జోన్ లేదని... నిన్న జరిగిన సమావేశంలోనే కేంద్ర అధికారులు క్లారిటి ఇచ్చారని సమాచారం. ఈ వార్తలపై కేంద్ర మంత్రే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం (Central Government).. రైల్వే జోన్‌ హామీకి కట్టుబడి ఉందని.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Aswamy Vaisnav) మరోమారు స్పష్టం చేశారు. అయితే విశాఖ రైల్వే జోన్‌ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తు్న్నాయని.. అసలు అలాంటి చర్చే జరగలేదు అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు.

  అలాగే ఈ జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైన భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉందని.. త్వరలోనే పూర్తి స్థాయి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలోనే కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

  కేంద్ర మంత్రే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో రైల్వే జోన్ ఏర్పాటు ఉంటుందని తేలిపోయంది. అయితే అది ఎలా ఏర్పాటు చేశారు. ఏ ఏ ప్రాంతాలను కలుపుతారు. ఏ ప్రాతిపధికన విభజన చేస్తారు అన్నదానిపై మాత్రం కేంద్రం స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా కేవలం  ప్రకటనలతోనే కేంద్రం కాల యాపన చేస్తోందనే తీవ్ర విమర్శలు కూడా లేకపోలేదు.

  ఇదీ చదవండి : అనంతపురంలో మెగా కోలాహలం.. ఉదయం నుంచే సందడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  అయితే రెండు రోజుల నుంచి విశాఖకు రైల్వే జోన్ లేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

  ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కార్యాలయాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ.. అత్యవసరం అయితే?

  విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చిందన్నారు. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను అని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, GVL Narasimha Rao, Railway, Visakha Railway Zone