Home /News /andhra-pradesh /

AP POLITICS GOOD NEWS TO VILLAGE AND WARD VOLUNTEERS EVER MONTH DEPOSIT FOR NEWS PAPERS NGS

Good news: గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేకంగా అకౌంట్లో డబ్బులు.. ఎందుకో తెలుసా?

ఏపీలో వాలంటీర్లకు సత్కారం

ఏపీలో వాలంటీర్లకు సత్కారం

Good news: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. వారి అందరి ఖాతాల్లో ప్రతి నెల ప్రత్యేకించి నగదు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంప భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విపక్షాలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  Good news: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనన నుంచి పుట్టుకొచ్చారు గ్రామ, వార్డు వాలంటీర్లు (Volunteers).. వారిని ఉద్యోగులా కాకుండా సేవా భావానికి నియమించినట్టు సీఎం పదే పదే చెబుతూ ఉంటారు. ఇటీవల పల్నాడు జిల్లా (Palanadu District) నరసరావుపేట లో జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో.. సైతం అదే మాట చెప్పారు సేవా భావంతో పని చేస్తున్న వారికి సీఎం జగన్ (CM Jagan) అభినందనలు తెలిపారు. వారి సేవలను అభినందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థవైపు దేశం మొత్తం చూడటం గర్వంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని జగన్‌ అభిప్రాయపడ్డారు. తమకు ఎంత లాభం వస్తుందనేది లెక్కేసుకోకుండా.. సేవమాత్రమే లెక్కలు వేసుకొని పేదల కళ్లలో సంతోషాన్ని, సంతృప్తిని చూడటానికి వాలంటీర్లు కష్టపడుతుండడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు జగన్. అందుకే రాష్ట్రంలో 2 లక్షల 60 వేల మంది సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాని సీఎం జగన్ కొనియాడారు.

  వాలంటీర్లను అంతలా గౌరవించే సీఎం గజన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాతాల్లో ప్రతినెలా ప్రత్యేకంగా డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. అయితే ఓ కండిషన్ పెట్టారు. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు ప్రతి నెల 200 రూపాయల చొప్పున ఇవ్వనుంది. అంతేకాదు న్యూస్ పేపర్ ద్వారా సమకాలీన అంశాల గురించి తెలుసుకుని దుష్ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల ఆందోళనలను తొలగించవచ్చని జగన్ సర్కారు పేర్కొంది. 2022 జులై నుంచి 2023 మార్చి వరకు ఈ సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీళ్లందరికీ ప్రతి నెలా రూ.200 నగదును న్యూస్ పేపర్ల కోసం ప్రభుత్వం వెచ్చించనుంది.

  మరోవైపు ప్రతి ఏడాది ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లను ప్రభుత్వం సన్మానిస్తోంది. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది రోజున ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి అవార్డుకు ఎంపిక చేసి 10 వేల రూపాయల నగదు, ప్రసంశా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరిస్తోంది. మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు ప్రభుత్వం అవార్డులు, రివార్డులు అందజేస్తోంది. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా సేవా రత్న అవార్డులను ప్రదానం చేస్తోంది.  అయితే తాజా నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం సీఎం కు చెందిన పేపర్ సర్క్యూలేషన్ పెంచుకోవడానికే ఈ ప్రయత్నమంతా అన్నారు.. వాలంటీర్లకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి.. ఆ డబ్బులతో సాక్షి పేపర్ కొనుక్కునేలా చేస్తే.. ఆ సొమ్మంతా మళ్లీ జగన్ కే వెళ్తోంది అన్నారు.. జగన్ డబ్బు ఆశకు ఇది మరో నిదర్శనం అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

  ఇదీ చదవండి : సామాన్య ప్రజలకు అండగా జనసేనాని.. పవన్ జనవాని కర్యాక్రమానికి అనూహ్య స్పందన.. వేలాదిగా తరలి వచ్చిన జనం

  నిజంగా సీఎం జగన్ కు చిత్త శుధ్ది ఉంటే.. వాలంటీర్లకు ఫ్రీగా సాక్షిపేపర్లు ఇస్తే.. ప్రజా ధనం మిగులుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు.. లేదంటే వాళ్లకు నచ్చిన పేపరు కొనుక్కునే అవకాశం అయినా కల్పించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు