హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Goo News: ఒంటరిగా ఉంటున్నారా.. మీకో గుడ్ న్యూస్.. కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

Goo News: ఒంటరిగా ఉంటున్నారా.. మీకో గుడ్ న్యూస్.. కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

ఏపీ సీఎం  వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

Goo News: సంక్షేమ పథకాలు అందించడంలో జగన్ సర్కార్ నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. తాజాగా ఒంటరిగా ఉన్నవారికి కూడా శుభవార్త చెప్పింది. ఇకపై అలాంటి వారికి కూడా కార్డులు అందించాలని నిర్ణయించింది. అయితే వారు ఏం చేయాలంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Goo News: సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ (CM Jagan) .. మధ్య మధ్య కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు.  మొదటి నుంచి ప్రకటించిన పథకాలకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా విడతల వారిగా నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. పేదల సంక్షేమమే తన లక్ష్యం అని చెపుతున్న జగన్ మోహన్ రెడ్డి.. ఎప్పటి కప్పుడు పాత పథకాల్లో కూడా లబ్ధి దారులను పెంచుకుంటూ వెళ్తున్నారు. అన్ని అర్హతలు ఉండి ఏవైనా సాంకేతిక కారణాలతో పథకాని దూరమైతే.. వారికి మళ్లీ అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది కొత్త వారిని చేరూస్తూనే ఉన్నారు. దీంతో ప్రతి పథకానికి ఏడాది ఏడాదికీ లబ్ధి దారులు పెరుగుతూ వస్తూనే ఉన్నారు. తాజాగా కొత్త రైస్ కార్డుల (Rice Cards) కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.. దగ్గర్లో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని సూచిస్తోంది. ఇదే సమయంలో ఒంటరిగా ఉంటున్నవారికి శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ లో అనర్హత కారణంగా రైస్‌ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే దీని కోసం ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్‌ స్టెప్‌ వెరిఫికేషన్‌) చేయనున్నారు. ఈ ఆరు స్టెప్పుల తరువాత.. వివరాలు అన్నీ సక్రమంగా ఉండి.. వారు రైస్ కార్డు తీసుకోవడానికి అర్హులు అని తెలితే.. వెంటనే కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది.

ఈ కొత్త కార్డు పొందడానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం పథకం అందుతున్నవారితో పాటు.. విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్న వారికి.. అలాగే సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్‌ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్‌ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది.

ఇదీ చదవండి : కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము తిని బలిసికొట్టుకుంటున్నారు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్.. వార్నింగ్ ఎవరికి?

కేవలం ఒంటరి వారికి మాత్రమే కాదు.. సాధారణంగా ఏదైనా కారణంతో మీ కార్డు రద్దైందా..? అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటి వరకు రేషన్ కార్డు (Ration Card) లేకుండా ఉన్నారా..? ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డుకు అప్లై చేయలేదా.. అలాంటి వారి అందరికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోలని కోరుతోంది. రాష్ట్రంలో అనర్హత కారణంగా రైస్ కార్డు కోల్పోయినవారు.. నిజంగా అర్హులు అని భావిస్తే.. సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మళ్లీ కొత్త కార్డు పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొత్తకార్డు మంజూరుకు ఫౌర సరఫరాల శాక (Civil Supply Department) అవకాశం కల్పించింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, Ap welfare schemes, Ration card

ఉత్తమ కథలు