Home /News /andhra-pradesh /

AP POLITICS GOOD NEWS TO RRR MOVIE LOVERS AND PRODUCERS AP GOVERNMENT GREEN SIGNAL TO INCREASE TICKETS RATE NGS

RRR: జూనియర్ ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..?

సీఎం జగన్, ఎస్ఎస్ రాజమౌళి (ఫైల్)

సీఎం జగన్, ఎస్ఎస్ రాజమౌళి (ఫైల్)

RRR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైందా..? ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కోరిన డిమాండ్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.. రాజమౌళి వచ్చి స్వయంగా కలిసి కోరడంతో ఏపీ ప్రభుత్వం అనుకలంగా స్పందించిందా..? ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్.

ఇంకా చదవండి ...
  Good News to RRR: ఇటీవల ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) సినిమా టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో టాలీవుడ్ (Tollywod) కి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పూర్తిగా తొలగిపొతుందని అంతా ఆశించారు. అయితే టికెట్ల రేట్లను పెంచిన ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టింది. ఏపీలో 20 శాతానికపైగా సినిమా షూటింగ్ జరిగితేనే.. ఆ ధరలు వస్తాయని కండిషన్లు పెట్టింది. దీంతో ప్రస్తుతం రిలీజ్ అయినా.. రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలకు ఇబ్బంది తప్పడం లేదు. వకీల్ సాబ్ తో ఏపీలో టికెట్ల వివాదం మొదలైంది. ఆ సినిమా రిలీజ్ తరువాత ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను తగ్గించింది. పేదవాడికి వినోదం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే రేట్లను తగ్గించామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే అప్పటికే కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఆ వెంటనే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు తప్పలేదు. అప్పటి నుంచి టాలీవుడ్  పెద్దలు ఎన్ని వినతలు చేసినా.. ఏపీ ప్రభుత్వం (A{ Government) పట్టువీడలేదు. కానీ ఇటీవల మెగాస్టర్ చిరంజీవి (Megastar Chinjeevi) స్వయంగా వెళ్లి సీఎంను కలిసి సమస్యలు చెప్పడం.. ఆ తరువా చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరాటాల శివ తదితరలు వెళ్లి నేరుగా సీఎం జగన్ ను కలిసి సమస్యపై చర్చించడంతో.. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak)కు ముందే ఈ నిర్ణయం రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. అయితే అదంతా పవన్ పై కోపంతోనే ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించలేదని ఆరోపణలు వినిపించాయి. ఆ వివాదం ఎలా ఉన్నా..? ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. కానీ కండిషన్లు పెట్టింది..

  సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేయడంతో సినిమా రంగానికి చెందిన వారు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ జీవో ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకున్న సినిమాలకు మాత్రేమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కలిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా రిలీజ్‌కు రెడీ కావడంతో, ఈ అవకాశాన్ని రాధేశ్యామ్ సినిమాకు ఉపయోగపడుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

  ఇదీ చదవండి: మంత్రులుగా కొనసాగేది వీరే.. ఆయనకు కీలక పదవి.. కొత్త ఎమ్మెల్యేలకు ఛాన్స్.. జగన్ ఫార్ములా ఇదే

  దీంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ కు కూడా భయం మొదలైంది. దీంతో రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్‌ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత డివివి.దానయ్యలు కలిసి సినిమా టికెట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కాబోతున్న తమ భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం సినిమా టికెట్ల రేటు పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

  ఇదీ చదవండి: మంత్రులుగా కొనసాగేది వీరే.. ఆయనకు కీలక పదవి.. కొత్త ఎమ్మెల్యేలకు ఛాన్స్.. జగన్ ఫార్ములా ఇదే

  ఈ సమావేశంలో సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని రాజమౌళి అన్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ చిత్ర టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లను అదనంగా 100 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలుస్తోంది. మరోవైపు బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ప్రచారం ఉంది. ఇంకా సినిమా రిలీజ్ కు సమయం ఉండడంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  ఇదీ చదవండి: ఆశలపల్లకిలో టీడీపీ.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ.. పవన్ వ్యూహం ఇదే

  బెనిఫిట్ షో సంగతి ఎలా ఉన్నా... ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేటును అదనంగా 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో ఇది ఖచ్చితంగా RRRకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీ బడ్జెత్‌తో తెరకెక్కిన సినిమా కావడం, డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ రేటుకు ఈ సినిమా హక్కులను అమ్మడంతో అందరూ నష్టపోకుండా ఉండేందుకు జక్కన్న చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించినట్టే.. ఇక బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ దొరికితే RRR భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, RRR, SS Rajamouli, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు