హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఏపీలో ఉన్నత విద్య చదవాలి అనుకున్న వారికి గుడ్ న్యూస్.. దరఖాస్తకు గడువు పెంపు.. ఎలా అప్లై చేయాలి? అర్హతలేంటి?

CM Jagan: ఏపీలో ఉన్నత విద్య చదవాలి అనుకున్న వారికి గుడ్ న్యూస్.. దరఖాస్తకు గడువు పెంపు.. ఎలా అప్లై చేయాలి? అర్హతలేంటి?

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

CM Jagan: ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్నారా.. అన్ని అర్హతలు ఉన్నా.. డబ్బులేక మీ కోరికను తీర్చుకోలేకపోతున్నారా? అయితే మీకు సువర్ణావకాశం.. ఉన్నత విద్యను అందించేందుకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  CM Jagan: సంక్షేమ పథకాలు (AP Wefare Schemes) అందించడంలో తనకుతానే సాటి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిరూపించుకుంటున్నారు. పేదలకు విద్యాను దగ్గర చేయాలని లక్ష్యంతో ఇప్పటికే అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక, విద్యా వ్యవస్థ ప్రక్షాళణకు నాడు-నేడు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉన్న పథకాలను కొనసాగిస్తూ.. కొత్త వాటిపై ఫోకస్ చేస్తున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉన్నత విధ్య చదువుకోవాలని ఉన్నా.. డబ్బులు లేక ఇబ్బంది పడే వారికి శుభవార్త చెప్పారు. విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీల్లో పెద్ద చదువులు అభ్యసించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు అధికారులు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ,

  మైనార్టీ, ఈబీసీ(అగ్రవర్ణ పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేలా

  గత నెల 30 వరకు ప్రభుత్వం గడువిచ్చిందన్నారు.

  మొదట గత నెల 30వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అయితే ఆ గడువు ముగిసే లోపు.. 392 దరఖాస్తులొచ్చాయని, ఈ పథకంలో మరింత మందికి మేలు చేసే లక్ష్యంతో మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకటి నుంచి వంద క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు కోటి అయినా నూరు

  శాతం రీయింబర్స్‌మెంట్ చేస్తున్నారు.

  ఇదీ చదవండి : మంత్రి రోజా బైక్ ర్యాలీ.. నాలుక కోసి కారం పెడతానంటూ వార్నింగ్

  క్యూఎస్‌ ర్యాంకుల్లో 101 నుంచి 200లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే 50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసేలా పథకాన్ని రూపొందించినట్టు వివరించారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్‌ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

  ఇదీ చదవండి : నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూల.. సరస్వతీ దేవి రూపంలో దర్శనం.. విశిష్టత ఏంటంటే?

  వారికి వంద శాతం ఫీజు చెల్లింపు..

  జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంది. అయితే 101 నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే 50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షల వరకు పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్.. నిబంధనలు సడలించి వారి సేవలకు సలామ్

  ఎలా దరఖాస్తు చేయాలి..?

  ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారో.. వారు కులం, ఆదాయ సర్టిఫికెట్లు, మార్కులిస్టు తదితర వివరాలతో ఇవాళ రాత్రి లోపు http:// jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఈ పథకం వర్తింపజేస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు