AP POLITICS GOOD NEWS TO MEGA FANS AP GOVERNMENT GREEN SIGNAL TO HIKE TICKET PRICE IN ANDHRA PRADESH NGS
Acharya: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య సినిమాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
‘ఆచార్య’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ (Twitter/Photo)
Acharya Movie Tickets: ఆచార్య చిత్ర యూనిట్ కు.. మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి పది రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది..? దీంతో ధరలు ఎలా ఉండనున్నాయి అంటే..?
Acharya Movie Tickets: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రం ఆచార్య (Acharya). తనయుడు రామ్ చరణ్ (Ramcharan) కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే యూనిట్ కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ఆచార్య సినిమా టికెట్ రేట్ల (Acharya Ticket Rates)ను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ నుంచి మొదటి పది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని కేసీఆర్ సర్కార్ చెప్పింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు పెంచుకునేందుకు, సాధారణ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీంతోపాటు వారం రోజుల పాటు ఆచార్య ఐదో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక క్రేజీ అప్‌డేట్ మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది.
ఇక ఏపీ విషయానికి వస్తే.. పదిరోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సినిమా నిర్మాణ బడ్జెట్ 100కోట్లు దాటిన నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికి తోడు.. సినిమా షూటింగ్ 25 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఇల ప్రభుత్వం విధించిన షరతులు అన్ని సినిమాకు వర్తించడంతో.. టికెట్ రేట్ల విషయంలో స్పష్టత నిచ్చినా ఐదో షో విషయంలో మాత్రం ఏపీ సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ అవకాశం కూడా ఇవ్వాలని ఆచార్యా యూనిట్ కోరుతోంది.
తాజాగా ప్రభుత్వం నిర్ణయంపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఐదో షో విషయంపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. మరోవైపు ఆచార్య రన్నింగ్ టైం కొరటాల సుమారు 3 గంటలు ఉండేలా డిజైన్ చేశాడని ఇన్‌సైడ్ టాక్. అలాగే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కేవలం లాహే లాహే పాటలోనే కనిపించనుందని తెలుస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.