Home /News /andhra-pradesh /

AP POLITICS GOOD NEWS TO ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES EHS SERVICES AT OTHER STATES ALSO NGS GNT

Good News: ఏపీ ఉద్యోగులకు మరో శుభవార్త.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆ సేవలకు గ్రీన్ సిగ్నల్

 సీఎం జగన్( ఫైల్)

సీఎం జగన్( ఫైల్)

Good News: సంక్షేమానికి కేరాఫ్ అనే చెప్పుకునే సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎక్కువగా వైద్య, విద్యా రంగాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య పరంగా ఓ శుభవార్త చెప్పారు. ఆ సేవలకు ఇతర రాష్ట్రాల్లోనూ అవకాశం కల్పించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మొదటి నుంచి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. కరోనా (Corona) కష్టాకాలం ఎదురైనా.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఆయన మొదటి ప్రాధాన్యం సంక్షేమానికే అంటున్నారు. నవరత్నాల పేరుతో ఇప్పటికే అనేక పథకాలు (Welfare Schemes) ప్రవేశ పెట్టారు.  అన్నిటికన్నా ముఖ్యంగా విద్యా, వైద్య రంగంలో సంక్షేమానికి పెద్ద పీట వేయడంతో పాటు.. సమూర మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఎన్నో మార్పులు చేశారు కూడా.. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ ఫ్యామిలీ డాక్టర్ మొదలు కానుంది. ఇలా వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఆయన.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇటీవల ప్రభుత్వం నిర్ణయాల కారణంగా.. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక శాతం ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది.
    రాష్ట్రంలో ఇప్పటికే అందిస్తున్న కీలక సేవల్ని పొరుగు రాష్ట్రాల్లోనూ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.

    ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆరోగ్య సేవల్ని ఈహెచ్ఎస్ కార్డులతో రాష్ట్రంలో అందిస్తోంది. వీటిని ఆరోగ్యశ్రీ తరహాలో అందిస్తున్నారు. ఈ సేవల ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోంది కూడా. అయితే ప్రధానంగా చాలా రోజులుగా ఒక డిమాండ్ ఉంది. ఈ సేవలను ఇతర రాష్టాల్లోనూ విస్తరించాలని.. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఆరోగ్యశ్రీ లాగే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలు తీసుకునే అవకాశం లభించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



    ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు వర్తింపజేయని 565 చికిత్సలను కూడా ఇందులో అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. అలాగే ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులు పొందిన సేవల బిల్లుల్ని ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీమ్ తో చెల్లింపులు చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల ఆరోగ్య
    బిల్లుల్ని వెంటనే చెల్లించేందుకు వీలు కలుగుతుంది. అప్పుడు ఆస్పత్రులు కూడా ఉద్యోగులకు పూర్తిస్ధాయిలో సేవలు ఇచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయానికి ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు ఇస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి : ఒక్క రూపాయి పంపించి.. 50 ల‌క్ష‌లు కొట్టేశాడు.. ఎలా మోసం చేశాడంటే..?

    ఉద్యోగసంఘాలతో మంత్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉద్యోగుల
    మెడికల్ రీయింబర్స్ మెంట్ స్కీం ను మరో ఏడాది పాటు పొడిగేంచేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఉద్యోగులు
    సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు