Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో దక్షిణ మధ‌్య రైల్వే (South Central Railway) పరిధిలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మీదుగా ప్రయాణించే వారి కోసం.. సంక్రాంతి పండుగ (Sankranthi Festival) సందర్భంగా ప్రతి ఏటా ప్రత్యేక రైళ్లు వేస్తారు. ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా.. రద్దీ మాత్రం తగ్గదు.. అంతకంతకూ రెట్టింపు అవుతూనే ఉంది. అయితే పండగ ముగిసిన తరువాత రద్దీ తగ్గుతుంది.. కానీ ప్రస్తుతం సంక్రాంతి పండగ ముగిసిన తరువాత కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల కొనసాగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది.
ఆ ట్రైన్ల జాబితా ఇదే..
ట్రైన్ నంబర్ 07154/07156 యశ్వంత్‌పూర్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్-యశ్వంత్‌పూర్ రైలు, ట్రైన్ నంబర్ 07157 యశ్వంత్‌పూర్-నర్సాపూర్ రైలు, ట్రైన్ నెంబర్ 08506 సికింద్రాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 07323-07324 సికింద్రాబాద్-జసిది-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను పొడిగించారు.
అలాగే కాకినాడ తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును కూడా పొడిగించారు. ట్రైన్ నంబర్ 07797/07798 కాచిగూడ-తిరుపతి-కాచిగూడ రైలును 20,21 తేదీలలో పొడిగించారు. ఈ ప్రత్యేక రైలు జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప , రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ఇదీ చదవండి : గంటా రీ ఎంట్రీతో అయ్యన్న ఫైర్.. ఎవడయ్యా గంటా.. లక్షల్లో ఒక్కడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు
ట్రైన్ నంబర్ 07413 తిరుపతి-జాల్నా ప్రత్యేక రైలును ఫిబ్రవరి 2 నుంచి 28వరకు పొడిగించారు. 07414 జాల్నా-తిరుపతి ప్రత్యేక రైలును ఫిబ్రవరి 12 నుంచి మార్చి 5వ తేదీ వరకు పొడిగించారు. ట్రైన్ నంబర్ 07651 జాల్నా-చాప్రా ప్రత్యేక రైలును ఫిబ్రవరి 8 నుంచి మార్చి 1 వరకు పొడిగించారు. ట్రైన్ నంబర్ 07652 చాప్రా-జాల్నా ప్రత్యేక రైలును ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వరకు పొడిగించారు.
ఇదీ చదవండి: వైసీపీకి ఏపీ ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారా..? మైనస్.. ప్లస్ పాయింట్లు ఏంటి..?
డబ్లింగ్ పనులతో ప్యాసింజర్ రైళ్ల రద్దు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని గుడివాడ-మచిలీపట్నం సెక్షన్ పరిధిలో డబ్లింగ్ పనుల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07871 గుడివాడ-మచిలీపట్నం ప్యాసింజర్ రైలును నేటి నుంచి జనవరి 29 వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07868 గుడివాడ-మచిలీపట్నం, ట్రైన్ నంబర్ 07869 మచిలీపట్నం-గుడివాడ, 07880 గుడివాడ-మచిలీపట్నం ప్యాసింజర్ రైళ్లను జనవరి 20 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ట్రైన్ నంబర్ 07464 విజయవాడ-గుంటూరు, 07465 గుంటూరు-విజయవాడ, 07628 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లను 20వ తేదీ నుంచి 22వరకు రద్దు చేశారు. విజయవాడ-మచిలీపట్నం-విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను మచిలీపట్నం-గుడివవాడ మధ్య రద్దు పాక్షికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను పెడన-మచిలీపట్నం మధ్య రద్దు చేశారు. గుంటూరు-రేపల్లె మధ్య నడిచే ప్యాసింజర్ రైలును గుంటూరు-తెనాలి వరకు పరిమితం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఇది వర్తిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Special Trains, Visakhapatnam