Home /News /andhra-pradesh /

AP POLITICS GAP BETWEEN YCP AND BJP YCP SENIOR LEADER GADIKOTA SRIKANTH REDDY SLAMS BJP LEADERS NGS GNT

YCP on BJP: బీజేపీ అంటే బాబు జనతా పార్టీ అంటూ ఫైర్.. వైసీపీ దూరం పెంచుకుంటోందా..?

గడికోట శ్రీకాంత్ రెడ్డి (Twitter)

గడికోట శ్రీకాంత్ రెడ్డి (Twitter)

YCP on BJP: జాతీయ పార్టీ బీజేపీకి.. వైసీపీకి దూరం పెరుగుతోందా..? అదే టైంలో బీజేపీకి టీడీపీని దగ్గర అయ్యేలా చేస్తోందా..? మొన్నటి వరకు బీజేపీ పై విమర్శలు చేయని.. వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీని బాబు జనతా పార్టీఅ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  YCP on BJP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ (BJP)-వైసీపీ (YCP) ఒకటే అనే ప్రచారం ఉండేది.. టీడీపీకి బీజేపీ దూరంగా ఉండేది.. కానీ ప్రస్తుతం వైసీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే సీన్ రివర్స్ అయ్యిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ పై వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్లు చేసేవారు కాదు.. కానీ ఇప్పుడు స్వరం మారింది. మొన్న పోలవరం (Polavaram)వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని.. ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ మరుచటి రోజే రాజ్యసభలో కేంద్రాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) నిలదీశారు. పెరుగుతున్న ధరలు తగ్గించడానికి ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. తాజాగా ఆ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీని.. బాబు జనతా పార్టీ గా మార్చారు అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే మొన్నటి వరకు.. అమరావతి (Amaravati) స్కామ్ క్యాపిటల్ అన్నది బీజేపీ నేతలు కాదా అంటూ ప్రశ్నించారు. అసలు కర్నూలు (Kurnool) లో హైకోర్టు పెట్టాలని డిక్లరేషన్ ఇచ్చింది మీరు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు న్యాయ రాజధానిపై ఎందుకు నోరు మెదపరు అంటూ నిలదీశారు. అలాగే బీజేపీ నేత సత్య కుమార్ అన్ని అసత్యాలే చెబుతున్నారని.. ఆయన చెప్పేవన్నీ చంద్రబాబు మాటలే అని అరోపించారు.

  వైసీపీని తిడితే..? కొన్ని మీడియా సంస్థలు నెత్తిన పెట్టుకుని కవరేజ్ ఎక్కువ ఇస్తుందనే ఆత్రంతోనే బీజేపీ నేత సత్య కుమార్ నోటికొచ్చినట్లు, వ్యక్తిగతంగా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు శ్రీకాంత్ రెడ్డి.. అమరావతిలో బీజేపీ నేతలు కొందరు పాదయాత్ర చేసి, ఆ ముగింపు సభలో ఆ పార్టీకి చెందిన సత్యకుమార్‌​ అనే వ్యక్తి అసత్య కుమార్ లా, సత్య దూరమైన మాటలు మాట్లాడారని మండిపడ్డారు. తాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతు కోరలేదని వ్యాఖ్యలు చేసి, ఆ పార్టీ అధిష్టానంతో చీవాట్లు తిన్న అతడి బుద్ధి మారడం లేదన్నారు. 

  కేవలం టీడీపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి, కేసులకు భయపడి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరికో, సీఎం రమేష్‌కో... సత్యకుమార్‌ ఎప్పుడూ కొమ్ము కాస్తూ వస్తున్నారని విమర్శించారు. వీరంతా కలిసి, చివరికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు జనతా పార్టీ గా మార్చేశారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసే మంచిని, మేం గడప గడపకు వెళ్ళి ధైర్యంగా ప్రజల దగ్గరకు తీసుకువెళుతుంటే, అది చూసి ఓర్వలేక, అబద్ధాలనే విమర్శనాస్త్రాలుగా చేసుకుని తమపై నిందలు మోపడం సరికదాన్నారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కోటలో చంద్రబాబు నాయుడు స్కెచ్.. ప్లాన్ ఏంటంటే..?

  కర్నూలులో హైకోర్టు పెట్టాలని భారతీయ జనతా పార్టీ 2018లో డిక్లరేషన్‌ ఇచ్చిందని.. అలాంటిది తమ ప్రభుత్వం వికేంద్రీకరణ చేయాలని విధానంగా తీసుకుని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటే.. ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, మీ చేతిలో ఉన్న అంశాన్ని, మీరు చేసిన డిక్లరేషన్ కు అనుకూలంగా ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నారని నిలదీశారు. అమరావతి రాజధాని పేరుతో లక్ష కోట్లు మింగేస్తున్నారంటూ బీజేపీ నేతలే చేసిన విమర్శలు ఇప్పుడు గుర్తుకు లేవా అని ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి : చంద్రబాబు ప్రత్యర్థికి సీఎం జగన్ బంపర్ ఆఫర్.. మంత్రి పదవిపై హామీ.. ఇంకా ఏం చెప్పారంటే?

  రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందని.. మరి దానిపై సత్య కుమార్‌ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే దానిపై మాట్లాడండి అంటూ డిమాండ్ చేశారు. రాయలసీమను ఫ్యాక్షనిస్ట్‌ ప్రాంతంగా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. మీ హయాంలో రాయలసీమకు ఏం మేలు చేశారో చెప్పాలని కోరారు. సీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనే జరుగుతోంది అన్నారు.

  ఇదీ చదవండి : వెంకయ్య స్థానంలో విజయసాయి రెడ్డి.. వైసీపీ ఎంపీకి అరుదైన అవకాశం

  ఏపీనుంచే దేశం అంతా గంజాయి సరఫరా అవుతుందంటూ మాట్లాడటానికి సత్య కుమార్‌కు సిగ్గుండాలి అన్నారు. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులే అధికారంలో ఉన్నారు కదా అని గుర్తు చేశారు. మరి దేశంలో గంజాయిని అడ్డుకోకుండా గాడిదలను కాస్తున్నారా?తమ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గంజాయి సాగును పెంచి పోషించారని.. అప్పుడు బీజేపీ నేతలు ఏమయ్యారని ప్రశ్నించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు