హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

NTR: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

NTR: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

NTR: ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్ కు జై కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తొలిసారి.. ప్రభుత్వం తీరును తప్ప పట్టారు.. ఆ నిర్ణయం సమర్ధనీయం కాదంటూ.. వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మరి దీనిపై కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్పు వివాదా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) రాజకీయాలను కుదిపేస్తోంది. రాత్రికి రాత్రే రాజకీయా కారణాలతో.. ఎన్టీఆర్ పేరు (NTR Name) తొలగించడం సరైంది కాదని టీడీపీ నేతలు (TDP Leaders) ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట ఆందోళలను చేపట్టారు. ఇక చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన తరువాత.. మంత్రి విడదల రజనీ (Minster Vidala Rajani).. బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ నిర్ణయంపై కేవలం టీడీపీ సభ్యులే కాదు.. ఇతరులు కూడా మండిపడుతున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి.. ఇటీవల ఆ పార్టీకి బై బై చెప్పి.. జగన్ కు జై కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi) సైతం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పట్టారు.

  హెల్త్ యూనివిర్శిటీ కోసం ఎంతో కష్టపడ్డ.. ఎన్టీఆర్ పేరును మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చరిత్రాత్మక నిర్ణయం అని.. కానీ ఇలా ఉన్న యూనివర్శిటికి ఆయన పేరు తీసేయడం సమంజసం కాదన్నారు. వెంటనే ఆ పేరును కొనసాగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  వల్లభనేని వంశీ ప్రస్తుతానికి ప్రభుత్వం  నిర్ణయాన్ని తప్పు పట్టారు. అలాగే ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే.. కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే లక్ష్మీ పార్వతి సైతం దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయం షాక్ కు గురి చేసింది అన్నారు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు.

  ఇదీ చదవండి : వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంది అన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తామంటూ.. క్రెడిట్ లక్ష్మీ పార్వతికి వస్తుందని.. అప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇలా పాలకులు ఎవరైనా ఎన్టీఆర్ కు అన్యాయమే చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  ఇదీ చదవండి : కృష్ణం రాజు వ్యాక్స్ విగ్రహం సిద్ధం.. ప్రభాస్ కోరికపై తయారీ.. ప్రత్యేకత ఇదే

  మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సైతం ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయంపై మండిపడ్డారు. ఎవరైనా వ్యక్తులు పేర్లు మార్చగలరు కానీ.. చరిత్రను మార్చలేరని మండిపడ్డారు. ఇలా పేర్లు మారుస్తూ ఎంతకాలం నిరంకుస పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెంటనే మాజీ మంత్రి కొడాలి నాని.. లక్ష్మీ పార్వతి స్పందించాలని డిమాండ్ చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Vallabaneni Vamsi, Vidadala Rajani, Ycp