హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gannavaram Politics: తాడేపల్లికి చేరిన గన్నవరం పాలిటిక్స్.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దు అంటూ విజయసాయి రెడ్డికి లేఖలు

Gannavaram Politics: తాడేపల్లికి చేరిన గన్నవరం పాలిటిక్స్.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దు అంటూ విజయసాయి రెడ్డికి లేఖలు

ఎంపీ విజయసాయి రెడ్డి (File)

ఎంపీ విజయసాయి రెడ్డి (File)

Gannavaram Politics: గన్నవరంలో రాజకీయాలు హీటెక్కాయి. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నేరుగా అధిష్టానానికి లేఖలు రాశారు కార్యకర్తలు.. ఆయనకు సీటు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా 30 వేలకు పైగా మెజార్టీతో గెలిపిస్తాం అంటూ విజయసాయి రెడ్డికి లేఖలు రాశారు..

ఇంకా చదవండి ...

  Gannavaram Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గన్నవరం (Gannavaram)ఎప్పుడు హాట్ టాపిక్ గా నే ఉంటుంది. అందుకు కారణం వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi).. ఎందుకంటే ఆయన గతంలో టీడీపీ (TDP)లో ఉన్నా.. ఆయన మనసంతా వైసీపీ (YCP)వైపే ఉందనే ప్రచారం ఉండేది.. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని (Kodali Nani)తో ఉండే సాన్నిహిత్యం..  అంతేకాదు గత  ఎన్నికల్లో వైసీపీ గాలిలో సైతం వంశీ టీడీపీ దూరం పెట్టినా.. అదే పార్టీ నుంచి గెలుపొందారు.. దీంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) తో వంశీకి సాన్నిహిత్యం ఉంది.. అందుకే ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ ప్రత్యేకంగా నిలుస్తారు. అయితే ఇటీవల ఆయన టీడీపీకి బై బై చెప్పి.. వైసీపీకి జై కొట్టారు.. అప్పటి నుంచి గన్నవరం వైసీపీలో రెండు వర్గాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఇంతకాలం ఆ గొడవ చేప  కింద నీరులా పాకుతూ వచ్చింది. ఇప్పుడు ఆ విబేధాలు అధిష్టానం దగ్గర పంచాయితీకి వచ్చింది..

  వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దు అంటూ.. వైసీపీ కార్యకర్తలు గత కొంతకాలగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వారంతా తమ అభిప్రాయాలు తెలుపుతూ.. కేంద్ర పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్న ఎంపీ ఎంపీ విజయసాయి రెడ్డికి లేఖలు రాశారు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి తప్పా.. ఎవరికి సీటు ఇచ్చినా.. కచ్చితంగా 30 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలు రాశారు. 

  ఇదీ చదవండి: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. గ్యాస్ బుక్ చేసుకోండి.. లక్కీ ఛాన్స్ మీదే

  మరి ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.. దాదాపు చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అవన్నీ అంతర్గత విబేధాలుగానే ఉన్నాయి. కానీ ఇలా నేరుగా ఎవరూ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదు. గన్నవరం కార్యకర్తల స్ఫూర్తితో.. ఇతర చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దానికి తోడు వల్లభ నేని వంశీ టీడీపీ నుంచి వైసీపికిలోకి వచ్చినప్పుడే.. వచ్చే ఎన్నికల్లో సీటుపై అధినేత హామీ ఇచ్చినట్టు సమాచారం.

  ఇదీ చదవండి: అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు..ఇలా అయితే కష్టమే అంటున్న కేడర్

  ప్రస్తుతం ఎవరికి ఎక్కడ సీటు ఇవ్వాలి అన్నాదానిపైనా అధినేత జగన్ దగ్గర ఓ లిస్ట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తోపటు.. సీఎం స్వయంగా చేసుకున్న నివేదికల ఆధారంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నారు. దీంతో వల్లభనేని వంశీకే వచ్చే ఎన్నికల్లో గన్నవరం సీటు ఖరారు చేశారనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇలా నేరుగా అధిష్టానానికి లేఖలు రాసినట్టు టాక్.. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Gannavaram, Vallabaneni Vamsi, Vijayasai reddy, Ycp

  ఉత్తమ కథలు