Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. టీడీపీ (TDP) నుంచి గెలిచినా.. ఆ పార్టీ అధినేతను.. పార్టీ నేతలను తిడుతూ.. వైసీపీ (YCP) కి జై కొట్టారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్చడంతో.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నేరుగా దానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కే లేఖ రాశారు. అయితే అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉన్నారు.. దీంతో వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి తెర దించారు వల్లభనేని వంశీ. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానని.. అది కూడా గన్నవరం నుంచే పోటీ చేస్తానని అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోక్కర్లేదు అన్నారు. ఈ విషయం టీడీపీ వాళ్లకు ముందే తెలుసు అని.. ఇంకా వైసీపీ నేతలు ఎవరికైనా అనుమానాలు ఉంటే.. నేరుగా అధిష్టానంతో మాట్లాడాలని.. తాను మాత్రం వైసీపీ నుంచి పోటీ చేయడం పక్కా అని స్పష్టం చేశారు.
అలాగే చంద్రబాబు నాయుడు తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వదిలేశారు అన్నారు. కేవలం చంద్రబాబుకు అవసరం ఉన్నప్పుడే ఎవరైనా ఆయనకు గుర్తొస్తారని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తోక పట్టుకుని చంద్రబాబు ఈదుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తన అనుచరులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. మంత్రులపై దాడి చేయడం సరైన పద్దతి కాదన్నారు.
ఇదీ చదవండి : చంద్రబాబును సీఎం చేసేందుకు కుట్రలు.. దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించాలన్న జగన్
కేవలం ఆరు శాతం ఓటు బ్యాంక్ ఉన్న జనసేన దాడికి దిగితే.. రాష్ట్రంలో 50 శాతం ఓటింగ్ వైసీపీ ఉందన్నారు. వైసీపీ తిరగబడితే పరిస్థితి ఏంటి అన్నది జనసేన అర్థం చేసుకోవాలి అన్నారు. అలాగే అమరావతి రైతుల యాత్రపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల పేరుతో పెట్టుబడి దారులు ఈ యాత్రను నడిపిస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి : లిక్కర్ స్కామ్ లో వైసీపీకి షాక్.. ఎంపీ కొడుకుని విచారిస్తున్న సీబీఐ
వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి అయనే అన్నది క్లారిటీ వచ్చేసింది. ఇక టీడీపీ తమ అభ్యర్థిగా గద్దె అనురాధను దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే వైసీపీ నుంచి వచ్చే ఓ నేతను బరిలో దింపే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gannavaram, Vallabaneni Vamsi, Ycp