హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో కీలక పరిణామం.. ఆ విషయంలో తగ్గేదే లేదన్న జగన్..

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో కీలక పరిణామం.. ఆ విషయంలో తగ్గేదే లేదన్న జగన్..

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

Vallabhaneni Vamsi: గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. అయితే ఆయనకు ఆ విషయంలో సీఎం పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram MLA Vallabaneni Vamsi) ఎప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంటున్నారు. ఆ మధ్య టీడీపీ పెద్దలను తిట్టి.. ఆ పార్టీకి బైబై చెప్పి.. జగన్ కు జై కొట్టారు. అనధికారికంగా వైసీపీ (YCP) ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు (NTR Health University Name Change) విషయంపై మాత్రం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నిర్ణయాన్ని బహిరంగంగానే వంశీ తప్పు పట్టారు. నిర్ణాయన్ని పున: సమీక్షించాలి అంటూ లేఖ కూడా రాశారు.

ఆ తరువాత నుంచి ఆయన సైలెంట్ అయ్యారు.  సొంత అనుచురలను కూడా కలవడం లేదని తెలిసింది. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఆయన.. అందరికీ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. త్వరలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని.. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన ఆయన.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా ఆయన ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డితో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారని తెలుస్తోంది. కేవలం అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదని .. మరే ఇతర కారణాలు లేవని చెప్పినట్టు టాక్. అయితే ఈ సందర్భంగా పలు విషయాలపై పార్టీ అధినే జగన్.. పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు ఆయన అనుచరులు చెబుతున్న మాట.

ఇదీ చదవండి : మాజీ మంత్రి వర్సెస్ మంత్రులు.. ఈ నెల 15న ఏం జరగనుంది..?

ముఖ్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వారం రోజుల్లో తిరిగి కార్యక్రమం ప్రారంభిస్తానని వంశీ తెలిపారని సమాచారం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు వంశీ. అయితే ఇటీవలే గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌ చర్చించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: సైజుతో సంబంధం లేకుండా సెగలు పుట్టిస్తోంది..? బంగారంతో పోటీ పడుతున్న పులస

గన్నవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించకపోవడంపై ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రశ్నించారట. ఈ సమీక్షకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని .. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: పార్టీ కోసం అన్నయ్య ఆస్తులు అమ్మారు.. రాజకీయ పార్టీ నడిపేంత ఆస్తులు తమ్ముడికి ఉన్నాయా? పవన్ ఆస్తుల విలువ ఎంత?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు కార్యక్రమంపై జగన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులు, వారసులు, బంధువులతో కాకుండా ఎమ్మెల్యేలు స్వయంగా గడప గపడకు కార్యక్రమంలో పాల్గొనాలని అధినేత సూచించారు. ఆయన సూచనల మేరకు వల్లభనేని వంశీ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vallabaneni Vamsi, Ycp

ఉత్తమ కథలు