హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Deputy Speaker: డిప్యూటీ స్పీకర్ కు చుక్కలు.. మందిమార్బలంతో కాదు ఒక్కరు రండి అని నిలదీసిన మహిళ

Deputy Speaker: డిప్యూటీ స్పీకర్ కు చుక్కలు.. మందిమార్బలంతో కాదు ఒక్కరు రండి అని నిలదీసిన మహిళ

గడప గడపకు ప్రభుత్వం.. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని నిలదీసిన మహిళ

గడప గడపకు ప్రభుత్వం.. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని నిలదీసిన మహిళ

Gadapa Gadapaku Government: ఏపీలో ప్రభుత్వం పాలన ఎలా ఉంది..? సంక్షేమం పథకాలు అందరికీ అందుతున్నాయా..? లేదా..? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు.. అలా తెలుసుకునేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ ను ఓ మహిళ సమస్యలపై నిలదీసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఇంతకీ ఆ మహిళ ఆవేదన ఏంటి..?

ఇంకా చదవండి ...

  Gadapa Gadapaku Government: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తైంది. మరి ఈ మూడేళ్లో తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా..? లేక సంక్షేమ పథకాలతో ఆదరణ పెరిగిందా.? సీఎం జగన్, మంత్రులు, అధికారులు అంతా ప్రజల్లో అపూర్వ ఆదరణ ఉందని. వ్యతిరేకత లేదని పదే పదే చెబుతున్నారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశామని సీఎం జగన్ చెబుతున్నారు. తన మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఏమోషన్ లా ట్వీట్ చేస్తూ.. అందులో 95 శాతం హామీలు పూర్తి చేశానని ఆయన స్వయంగా చెప్పారు. మరి హామీలు అంతలా పూర్తి చేస్తే ప్రజల్లో మంచి ఆదరణ ఉండాలి.. మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర నేతలు అంతా అదే అంచనాతో ఉన్నారు. తమ పాలనపై ఫీడ్ బ్యాక్ తెలుసుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉండి తమ గ్రాఫ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా గడప గపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ వెళ్తున్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు వైసీపీ (YCP) ఎమ్మెల్యేలంతా జనాల్లోకి వెళ్తున్నారు. అయితే చాలా చోట్ల వారికి నిరసన సెగలు తగులుతున్నాయి. వారికి సమాధనం చెప్పలేక మధ్యలో వెనుతిరగాల్సి వస్తోంది. దీంతో అంతా ముందుగానే ప్లాన్ చేసుకొని.. వాలంటీర్లను ముందు పంపించి.. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్న తరువాతే.. జనాల్లోకి వెళ్తున్నారు. అయినా అక్కడక్కడ నిరసనలు తప్పడం తప్పలేదు.

  ప్రభుత్వం అద్భుత స్పందన వస్తుందని భావిస్తే.. కొన్ని చోట్ల అధికార నేతలకు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు స్థానికులు. తాజాగా బాపట్లలో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఓ మహిళ నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. మందీ మార్బలంతో కాదు.. ఒక్కరే వార్డుల్లో పర్యటిస్తే అప్పుడు తమకు ఉన్న నిజమైన సమస్యలు తెలుస్తాయి అన్నారు. ముందుగానే ఏర్పాట్లు చేసుకుని వస్తే సమస్యలు ఎలా చెబుతారంటూ ఆమె నిలదీసింది.

  చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ ఈ సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా తనకు ఎదురైన పరిస్థితితో కొన రఘుపతి షాక్ అయ్యారు. మొదట ఆ మహిళలకు ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాల గురించి ఆయన వివరిస్తూ ఆ మహిళ అసహనానికి గురైంది. తమ సమస్యలపై గళమెత్తారు. డిప్యూటీ స్పీకర్​ను సూటిగా నిలదీశారు. మందీ మార్బలంతో కాదు.. ఎవరూ లేకుండా ఒక్కరే జనాల్లోకి రండి. అప్పుడు తమ సమస్యలు తెలుస్తాయి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా వార్దులో పారిశుధ్యం అద్వానంగా తయారైందని.. వారానికోసారి చెత్తను తీసుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Ycp

  ఉత్తమ కథలు