CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ (CM Jagan Mohan Reddy) చీమకుర్తిలో పర్యటించారు. అక్కడ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు. బూచేపల్లి కుటుంబానికి .. వైఎస్సార్ ఫ్యామిలీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయ. సీఎం పాల్గొన్న సభలో జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన తరువాత వెంకాయమ్మ జిల్లా గురించి మాట్లాడారు. వైఎస్సార్ (YSR) చేసిన పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ పాలనను ప్రశంసించారు. ఇలా వరుస వరుస పెట్టి పొగడ్త వర్షం కురిపించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ (Zill Parisath Chairman) గా జిల్లాకు సంబందించిన అంశాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అక్కడితో ఆమె ఉత్సాహం ఆగలేదు.. వైఎస్ కుటుంబం (YS Family) పై తనకు ఉన్న అభిమానాన్ని అందిరికీ తెలిసేలా ఏదైనా చేయాలి అనుకున్నారు.. అయితే ఆమె చేసిన పనికి సీఎం జగన్ అయితే నవ్వు ఆపుకోలేకపోయారు.. ఇంతకీ ఏమైంది అంటే..?
వైఎస్ ఫ్యామిలీని ప్రశంసిస్తూ ఆమె.. ఒక ఒక పాట అందుకున్నారు. ఆ పాట వింటుంటే జగన్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆయన అవస్థ చూసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారించే ప్రయత్నం చేసారు. కానీ, వెంకాయమ్మ వినలేదు. దీంతో.. సీఎం జగన్ తన సీటులో నుంచి లేచి వెళ్లి.. వెంకాయమ్మ వద్ద ఉన్న చనువుతో భుజం పట్టుకొని తీసుకొచ్చి తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టారు.
AP CM Jagan || ఆమె చేసిన పనికి పడిపడి నవ్విన జగన్ || నవ్వు ఆపుకోలేక ఏం చ... https://t.co/7kKNaAwKfc via @YouTube #CMYSJagan #YSRCP #YSRCheyutha #Jagan #JaganReddy #JaganPaniAyipoyindhi #jagannathuniversity
— nagesh paina (@PainaNagesh) August 24, 2022
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. సీఎం జగన్ తన ప్రసంగంలోనూ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డిని తన సోదరుడిగా.. వెంకాయమ్మను అమ్మగా అభివర్ణించారు. వెంకాయమ్మ కోరిన విధంగా జెడ్పీ హాల్ నిర్మాణానికి నిధులు.. రిజర్వాయర్ కు సుబ్బారెడ్డి పేరు ఖరారు చేసారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బూచేపల్లి సుబ్బారెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశించారని. అయితే..అది చూడకుండానే సుబ్బారెడ్డి కన్నుమూశారంటూ సభలో ఒక వీడియో ప్రదర్శించారు.
ఇదీ చదవండి : ఇది కుప్పం పులివెందుల అనుకుంటున్నారా..? రౌడీలకు భయపడేది లేదన్న చంద్రబాబు
అయితే దర్శి నుంచి గత ఎన్నికల్లో పోటీకి బూచేపల్లి కుటుంబం దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో శివప్రసాద రెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సభలో సీఎం జగన్ తాను 2023 సెప్టెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్తామంటూ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ongole