AP POLITICS FULL TENSION TO YCP MALS BECAUSE CM SET A TARGET TO 9 MONTHS TO IMPROVE TO GRAPH NGS VSP
YCP MLAs Graph: అధికార పార్టీ నేతల్లో గ్రాఫ్ గుబులు.. పనులు లేకుండా ఇమేజ్ పెంచుకోవడం ఎలా అంటూ ప్రశ్న..?
ప్రతీకాత్మకచిత్రం
YCM MLAs Graph: ఇప్పుడు ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా అదే చర్చ..? గ్రాఫ్ ఎంత..? పెరిగిందా తగ్గిందా..? ఇలా ఎవరికి వారు మదనపడుతున్నారు. ప్రభత్వ పెద్దలు, అధికారులు చేసిన పనులకు తాము బలి అవ్వాల్సి వస్తోంది అంటున్నారు. చేతిలో పనులు లేకుండా ఇమేజ్ పెంచుకోమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు..?
P Anand Mohan, Visakhapatnam, News18 YCM MLAs Graph: వైసీపీ ఎమ్మెల్యేలను ఇప్పుడు ఆ భయం వెంటాడుతోంది.. గ్రాఫ్ పెరిగిందా..? తగ్గిందా.? ఎక్కడ చూసినా ఇదే చర్చ.. మొన్నటి స్థానిక ఎన్నికల్లో విజయాలు చూసిన తరువాత.. నేతలంతా బుజాలు చరుకున్నారు. తమకు తిరుగులేదనుకున్నారు. తమ కష్టాన్ని అధిష్టానం గుర్తించిందని.. వచ్చే ఎన్నికల్లోను తమదే సీటు అంటూ ఇంతకాలం.. కేడర్ ను కూడా లైట్ తీసుకున్న నేతలు ఉన్నారు. కానీ మొన్నటి సమావేశంలో.. అందరికీ షాక్ ఇచ్చారు అధినేత జగన్.. తన గ్రాఫ్ 60 శాతం ఉందని.. ఎమ్మెల్యేల గ్రాఫ్ 40 శాతమే ఉందని.. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉండడంతో.. కేవలం తొమ్మిది నెలలే డెడ్ లైన్ పెట్టారు. ఆ తొమ్మిది నెలల కాలంలో గ్రాఫ్ పెంచు కోకపోతే భారం మోయడానికి సిద్ధంగా లేమని జగన్ స్పష్టం చేశారు. అంటే ఎవరైతే గ్రాఫ్ పెంచుకోలేదు.. .వారికి టికెట్ లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, ఫలితం బాగోకపోతే టిక్కెట్ రాదని చెప్పడంతో.. ఎమ్మెల్యేలు అందరిలోనూ గుబులు మొదలైంది. దీంతో తమ గ్రాఫ్ ఏంటని ఆరా తీసే పనిలో పడ్డారు. వచ్చే 9 నెలలు గడప గడపకు వైసీపీ పేరుతో ఇంటింటా ప్రచారానికి వెళ్లి గ్రాఫ్ పెంచుకోవాలని పార్టీ సూచిస్తున్నా.. అధి సాధ్యమయ్యే పనే అని మదన పడుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు తప్పదనే భయం నేతల్లో కనిపిస్తోంది. చాలా విషయాల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇంటిపన్నులు పెంచడం.. చెత్త పన్ను వేయడం.. బస్సు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు.. వీటికి తోడు అప్రటిత కరెంటు కోతలు.. వీటన్నటికీ తోడు నిత్యం పెరుగుతున్న ధరలు ఇలా ఒకటేంటి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి చాలానే అంశాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎలా సమాధానం చెప్పుకోవాలి అంటూ నేతలు మదన పడుతున్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తే.. కచ్చితంగా ఈ సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారు.. మరి వారికి ఏం సమాధానం చెప్పాలని నేతలు ఆలోచిస్తున్నారు.
మరోపక్క నియోజకవర్గాల్లో సొంత క్యాడరే తదుపరి ఎన్నికల్లో తమకు సీటు రాదని ప్రచారం చేస్తుండడంతో కొందరు ఎమ్మెల్యేలు నెత్తీనోరు బాదుకుంటున్నారు.
అసలు తమ గ్రాఫ్ పడిపోయిందా.. పెరిగిందా.. ఎలా తెలుస్తుందని ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి సర్వేలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సొంతగా సర్వే చేస్తే.. కాస్త అనుకూలంగానే ఉండే అవకాశం ఉంటుందని.. అది రివర్స్ అయితే మొదటికే మోసానికి వస్తుందనే భయం నేతల్లో కనిపిస్తోంది.
గ్రాఫ్ పెంచుకోని నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని అధినేత స్పష్టతనిచ్చారు. అయితే పంచాయతీ, జెడ్పీ ఎన్నికల్లో పార్టీ కోసం అంత చేసినా గ్రాఫ్ బాగోలేదనడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడచిన మూడేళ్లలో పనితీరు నిరూపించు కోవడానికి తమ చేతుల్లో ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా పథకాల పేరుతో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతోందని, సమస్య వస్తే జనం సచివాలయాల సిబ్బంది వద్దకే వెళ్తుండడంతో తమకు ప్రాధాన్యమే లేదని, అలాంటప్పుడు గ్రాఫ్ఎలా పెంచుకోగలమని ప్రశ్నిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా
పెరిగిన పన్ను భారాలు,
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జాడ లేకుండా.. పన్ను భారాలు, ఇతర వేధింపులతో ప్రజల్లో పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేక వచ్చిందని గుర్తుచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలా గ్రాఫ్ పెరుగుతుందని మదన పడుతున్నారు.
మే 10 నుంచి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇంటింటా తిరిగి మూడేళ్లలో పార్టీ అమలు చేసిన హామీలు వివరించాలని పార్టీ తాజా గా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలంతా తలపట్టుకుంటున్నా రు. విద్యుత్‌కోతలు, బిల్లుల పెంపు, ఇంటిపన్ను, చెత్తపన్ను, ఆర్టీసీ చార్జీల పెంపు, అమ్మఒడి ఎగ్గొట్టడం, కార్డులు, పెన్షన్ల కోతలు.. ఇళ్ల స్థలాలు ఊరికి దూరంగా ఇచ్చి చేతులు దులి పేసుకోవడం, కట్టిన వాటికి బిల్లులు చెల్లిం చకపోవవడం, ఓటీఎస్ వసూళ్లు.. ఇలా ఒక టేంటి ప్రభుత్వ వైఫల్యాలు భారీగా పేరుకు పోయిన దశలో నిరసనలు, తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందేమనోనని ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిం చడం పెద్ద సవాలేనని అంగీకరిస్తున్నారు. స్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.