Home /News /andhra-pradesh /

AP POLITICS FULL OF WELFARE SCHEMES IN JULY MONTH AP CABINET ANNOUNCE THE NAME AND DATE NGS

AP Welfare Schemes: అమ్మలతో పాటు వారికి అలర్ట్.. జులైలోనే మీ ఖాతాల్లో డబ్బులు.. ఏ పథకం డబ్బులు ఏ రోజు పడతాయంటే..

 Ammvodi: సీఎం జగన్ (CM Jagan) మానసపుత్రిక.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi) పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. అమ్మఒడి మూడో విడుత పథకాన్ని విడుదల చేయడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Ammvodi: సీఎం జగన్ (CM Jagan) మానసపుత్రిక.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi) పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. అమ్మఒడి మూడో విడుత పథకాన్ని విడుదల చేయడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అమ్మ ఒడి మూడో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు జులైలో వరుస సంక్షేమ పథకాలకు నగదు విడుదల చేసే తేదీలను ప్రకటించారు.. జులైలో అమలయ్యే సంక్షేమ పథకాలు ఏవి..? ఎప్పుడు నగదు విడుదల చేస్తారంటే?

ఇంకా చదవండి ...
    AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. కరోనా లాంటి మహమ్మారులు (Corona Virus) తీవ్ర ప్రభావం చూపినా.. రాష్ట్రం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా..? సీఎం మాత్రం సంక్షేమానికే ఓటు వేస్తున్నారు. రాష్ట్ర ఆదాయంతో సంబంధం లేకున్నా.. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలకు (Welfare Schemes) నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే సీఎం జగన్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. అమ్మ ఒడి (Ammavodi)ని తమ మానసిక పుత్రికగా భావిస్తారు. అందుకే అమ్మఒడి పథకానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా.. ఈ నెల 27వ తేదీని నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ భావించారు. అందులో భాగంగా ఈ నెల 27న తల్లుల ఖాతాలోకి అమ్మ ఒడి పథకానికి సంబంధించి అకౌంట్లో నేరుగా నగదు జమ కానుంది. ఇప్పటికే ఏపీ కేబినెట్ (AP Cabinet) సైతం దీనికి ఆమోదం తెలిపింది. దీంతో మొన్నటి జనవరి నుంచి నగదు ఎప్పుడు వస్తుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన ఈపథకం విడుదల తేదీని జూన్ 27వ తేదీకి పెంచింది ఏపీ ప్రభుత్వం.

    తాజాగా కేబినెట్ లో.. జులైలో ఏపీ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంక్షేమ పథకాల జాబితాను కూడా ఏపీ ప్రభుత్వం ప్రటించింది. 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జులై నెలలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మ మొదటిది జగనన్న విద్యా కానుక–జులై 5న నగదు విడుదల చేస్తారు. వైయస్సార్‌ వాహనమిత్ర–జులై 13న,
    వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. 

    ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. మన పిల్లలను ప్రపంచంలోనే విద్యారంగంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నామని గుర్తు చేసినట్టు తెలుస్తోంది. అలాగే బైజూస్‌ కంటెంట్‌ను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. 8వ తరగతి పిల్లలకు ఈ ఏడాది నుంచి ట్యాబ్స్‌ ఇచ్చేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తి చేసింది.

    ఇదీ చదవండి : వైసీపీలో ముదిరిన వర్గపోరు.. కౌన్సిలర్‌పై ఎమ్మెల్సీ వర్గీయుల దాడి

    ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్‌ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.7 లక్షల మంది పిల్లలకు ట్యాబ్స్‌ ఇవ్వనుంది సర్కార్? 2025లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్న వారిని సన్నద్దం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు