హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jaya Prada: ఆత్మకూరు ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద.. వచ్చే ఎన్నికలకు ట్రయల్ రన్..

Jaya Prada: ఆత్మకూరు ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద.. వచ్చే ఎన్నికలకు ట్రయల్ రన్..

ఆత్మకూరు స్టార్ క్యాంపెయినర్ జయప్రద

ఆత్మకూరు స్టార్ క్యాంపెయినర్ జయప్రద

  Glamour Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి (Andhra Pradesh Politics) రీ ఎంట్రీ ఇచ్చారు అలనాటి అందాల నటి జయప్రద (Jayaprada).  టాలీవుడ్‌ (Tollywood) తోపాటు బాలీవుడ్‌ (Bollywood) లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. రాజకీయ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాక.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆ తరువాత ఫేడ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు మనసు మార్చుకుని.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై ఫోకస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే తనకు రాజకీయంగా ప్లస్ అవుతుంది ఆమె అంచనా వేసుకుంటున్నారు. అందులోనూ గోదావరి జిల్లా (Godavari District) లు అయితే బెటరనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల రాజమండ్రి (Rajhmundry) లో బీజేపీ (BJP) నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు.  ఇప్పుడు ఆత్మకూరు బై పోల్ ద్వారా పొలిటికల్ ట్రయల్స్ వేస్తున్నారు.

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికను అధికార వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి రోజా.. మాజీ మంత్రి కొడాలి నానికి అప్పగించారు అధినేత జగన్.. ఈ ఉప ఎన్నికల్లో తమకు లక్షకు పైగా మెజార్టీ వస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. సానుభూమతి.. సీఎం జగన్ సంక్షేమ పాలన.. దీనికి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్.. టీడీపీ పోటీ లేకపోవడం ఇలా అన్ని ప్లస్ అవుతాయని లెక్క వేసుకుంటోంది. 

  ఇటు బీజేపీ సైతం ఆత్మాకూరులో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లు తమకు వస్తాయని.. జనసేన మద్దతు ప్లస్ అవుతుందని కమలం పార్టీ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే ప్రాచారాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దగ్గరుండి పర్యటవేక్షిస్తున్నారు. మరోవైపు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల‌ను సైతం ప్ర‌క‌టించింది. ఈ ఉప ఎన్నికకు ఆరుగురు స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను బీజేపీ నియ‌మించింది. సినీ న‌టి జయప్రద కూడా స్టార్ క్యాంపెయిన‌ర్ల‌లో ఉన్నారు.

  ఇదీ చదవండి : అమెరికన్ స్లాంగ్ తో ఇంగ్లీష్ మాట్లాడే బెండపూడి విద్యార్థులు పది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? నిజం ఏంటి..?

  నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇంటింటికి ప్రచారం కూడా పూర్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నేత‌ సునీల్ దేవధర్ కూడా పాల్గొన్నారు. ఈ నెల 18, 19వ‌ తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి కూడా పాల్గొంటారు. 19వ తేదీన ప్రచారంలో జయప్రద పాల్గొంటారు. 19, 20వ‌ తేదీల్లో బీజేపీ సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, 19వ తేదీన బీజేపీ నేత‌ కన్నా లక్ష్మీనారాయణ ప్ర‌చారంలో పాల్గొంటారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Jaya Prada

  ఉత్తమ కథలు