క్రియేటివ్ డైరెక్టర్ నుంచి కాంట్రవర్సీ డైరెక్టర్‌గా మారిన రాంగోపాల్‌వర్మ (Ramgopal varma)మరోసారి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెండు బలమైన సామాజిక వర్గాలను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా(Social media)లో పెట్టిన పోస్ట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఆదివారం టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan)భేటీని ఉద్దేశించే ఆర్జీవీ ఇంతటి ఘాటు విమర్శలు చేశారని సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వర్మను ఏకవచనంతో బండ బూతులు తిడుతున్నారు. రాంగోపాల్‌వర్మ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని..లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా అంతే అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఈ స్థాయిలో నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగిపారేస్తున్నారని సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంట్రవర్సీ కామెంట్ ఏంటో తెలుసా.
రాంగోపాల్‌వర్మ వివాదాస్పద ట్వీట్..
డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ మరోసారి వివాదాస్పద పోస్ట్‌తో కార్నర్ అయ్యారు. ముఖ్యంగా ఆదివారం ఆయన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ చేసిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీని ఉద్దేశించే ఆర్జీవీ ఈ పోస్ట్ పెట్టారని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, కాపు సామాజికవర్గానికి చెందిన వాళ్లు మండిపడుతున్నారు. ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా...రాజకీయాల్లో ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఈవిధంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక సామాజిక వర్గాన్ని చులకన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు ????????????
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
నువ్ చేస్తున్నది ఏంటీ వర్మ..
నీలి చిత్రాలు తీసుకోని అమ్మాయిల కాళ్ళు నాకీ జగన్ మోచేతి నీళ్ళు తాగే కుక్కవి అందులో ఒక్క అమ్మని తిట్టమనీ 5 కొట్లు ఇస్తామని చెప్పిన లుచ్చా గాడు కూడా నీతులు చెబుతున్నాడు రా మా కర్మ కాకపోతే అంటూ నెటిజన్లు వర్మను టార్గెట్ చేసి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రాజకీయాలు పట్టించుకోనని చెప్పావు కదా..ఇప్పుడెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావంటూ మరో నెటిజన్ రాంగోపాల్‌వర్మ తీరును తీవ్రంగా ఎండగట్టాడు. కేవలం డబ్బు కోసం నీ సొంత కులాన్ని, నీ వ్యక్తిత్వాన్ని రెడ్డిలకు అమ్మేస్తావని ఊహించా.. RIP RGV, కాంగ్రాట్యులేషన్స్ రెడ్డీస్ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. అంతే కాదు కత్తి మహేష్ లేని లోటు తీరుస్తున్నాడు అంటూ వర్ణించలేని పదజాలంతో దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆర్జీవీని కడిగిపారేస్తున్నారు..
పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై ఆదివారం మీడియా సాక్షిగా వైసీపీ నేతలు స్పందించారు. వారిద్దరి కలయిక కొత్తేమి కాదని కొందరు అంటే ..వారి భేటీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ మరికొందరు ప్రభుత్వంలో ఉన్న నేతలు మాట్లాడుకొచ్చారు. అయితే సామాజికవర్గాలను ఈ రాజకీయ భేటీలో తీసుకొచ్చి ట్విట్టర్ వేదికగా చులక చేస్తూ రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్ట్‌పై మాత్రం అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Chandrababu Naidu, Pawan kalyan, Ramgopal varma