హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Undavalli: జగన్ గ్యాంబ్లింగ్ సీఎం.. వైఎస్ సేల్స్ మేన్.. ఏపీలో పవన్ ఎఫెక్ట్ గ్యారెంటీ.. ఉండవల్లి షాకింగ్ కామెంట్స్..

Undavalli: జగన్ గ్యాంబ్లింగ్ సీఎం.. వైఎస్ సేల్స్ మేన్.. ఏపీలో పవన్ ఎఫెక్ట్ గ్యారెంటీ.. ఉండవల్లి షాకింగ్ కామెంట్స్..

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్ (ఫైల్)

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్ (ఫైల్)

రాజకీయాల్లో ఇలాంటి గ్యాంబ్లింగ్ ను ఎవరూ చేయలేదన్న ఆయన.. పథకాలకు ఎక్కడినుంచి డబ్బులు తెస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధులు దుర్వినియోగం చేసిందని చెప్పినా.. పేదలకు ఇచ్చానని చెప్తారే తప్ప జగన్ ఫీలవరన్నారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కాంగ్రెస్ (Congress) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ది ప్రత్యేక శైలి. సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఆయన చేసే వ్యాఖ్యలు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. అంతేకాదు ఉండవల్లి ప్రెస్ మీట్ పెడితే కొన్నిరోజుల పాటు సోషల్ మీడియా (Social Media) లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన పథకాల పేరుతో జగన్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజలకు డబ్బులిచ్చాను కాబట్టి.. వాళ్లు నాకు ఓటు వేయాలనేదే జగన్ విధానమని ఉండవల్లి అన్నారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

  అంతేకాదు ఓటు వేయనివారికి పథకాలు ఇవ్వరన్నారు ఉండవల్లి. ఇదే ఫార్ములాలో జగన్ సక్సెస్ అవుతారా.. ఫెయిల్ అవుతారా అనేది ఎవరూ చెప్పలేరన్నారు. రాజకీయాల్లో ఇలాంటి గ్యాంబ్లింగ్ ను ఎవరూ చేయలేదన్న ఆయన.. పథకాలకు ఎక్కడినుంచి డబ్బులు తెస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధులు దుర్వినియోగం చేసిందని చెప్పినా.. పేదలకు ఇచ్చానని చెప్తారే తప్ప జగన్ ఫీలవరన్నారు.

  ఇది చదవండి: చంద్రబాబుకు చైతన్య కాలేజీకి లింక్.. డబ్బా కొట్టుడు మానుకోవాలి.. సాయిరెడ్డి సెటైర్లు..


  దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కాంగ్రెస్ సీఎం అని.. ఆయనతో పాటు 30 మంది సేల్స్ మెన్ ఉంటే.. ఆయన చీఫ్ సేల్స్ మెన్ అని.. ఆయన దగ్గరకు వచ్చిన వారు వేరే వాళ్ల దగ్గరకు వెళ్లకుండా చూసుకునేవారన్నారు. ప్రజలతో రెండోసారి ఓట వేయించుకుని మరీ సీఎం అయ్యారని గుర్తేచేశారు. కానీ వైసీపీలో పరిస్థితి వేరని.. అక్కడ సర్వం జగనేనని.. పక్కా బిజినెస్ నడుపుతున్నారన్న ఉండవల్లి లాభమున్న పనులను మాత్రమే చేస్తున్నారని విమర్శించారు.

  ఇది చదవండి: బెస్ట్ ఫ్రెండ్ కి చంద్రబాబు సర్ ప్రైజ్.. ఇంటికెళ్లి విష్ చేసిన టీడీపీ చీఫ్


  ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్న ఉండవల్లి అది ఎరికి కలిసొస్తుందనేది మాత్రం చెప్పలేమన్నారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండటంతో రాజకీయశక్తుల మళ్లీ కలుస్తున్నాయన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో నేరుగా కులాల మధ్య యుద్ధం జరగుతోందన్న ఆయన.. బ్రదర్ అనిల్ పార్టీపైనా కామెంట్స్ చేశారు. గతంలో ఉన్న సాన్నిహిత్యం మేరకే ఆయన తనను కలిశారని.. కానీ అందులో ఎలాంటి రాజకీయాలపై చర్చ జరగలేదన్నారు.

  ఇది చదవండి: విద్యార్థులకు అలర్ట్.. అమ్మఒడికి కొత్త రూల్స్ ఇవే..! లేకుంటే డబ్బులు రావు..!


  అలాగే పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై ప్రతిపక్షంలో ఉండగా గగ్గోలుపెట్టిన సీఎం ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల బాధ్యతలు తీసుకున్న చంద్రబాబును విమర్శించిన జగన్.. తాను అధికారంలోకి వచ్చి న తర్వాత కేంద్రానికి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాదుకాబట్టి ఇక్కడ డబ్బులు ఖర్చు చేయడానికి ముందుకురావడం లేదని ఉండవల్లి అన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా పీఎంకు ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేక హోదా ఎందుకు లేదని ప్రశ్నించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pawan kalyan, Undavalli Arun Kumar

  ఉత్తమ కథలు