హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైంది... మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైంది... మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

చంద్రబాబు ఆలోచనల పైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందన్నారు

  కడపలో మాజీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభంజనం మొదలైందన్నారు. అది ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చన్నారు జేసీ. దీనికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్ష పాత్ర ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు వల్లే ఏపీ బీజేపీలో వలసలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆలోచనల పైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల పైన ప్రాంతీయ పార్టీలు ఆధార పడి ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయనేది తన అభిప్రాయమన్నారు జేసీ.

  గత కొన్నిరోజులుగా ఏపీలో బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. టీడీపీకీ చెందిన పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు వరుసగా కమలం పార్టీలోకి క్యూ కట్టారు. ఎంపీలు సుజనా, సీఎం రమేష్, టీజీ, గరికపాటి మొదటగా కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పలువురు సీనియర్ నేతలు కూడా బీజేపీలోకి జంప్ కొట్టారు. మరికొందరు కూడా కమలం గూటికి చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారాయి.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Bjp-tdp, JC Diwakar Reddy

  ఉత్తమ కథలు