హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLC Anantababu: అనంతబాబు ఆ ముగ్గురికి బినామీ..! మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..

MLC Anantababu: అనంతబాబు ఆ ముగ్గురికి బినామీ..! మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..

ఎమ్మెల్సీ అనంతబాబు (ఫైల్)

ఎమ్మెల్సీ అనంతబాబు (ఫైల్)

వైసీపీ (YCP) ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (MLC Ananta Udaya Bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇఫ్పటికే అనంతబాబును అరెస్ట్ చేశారు. ఆయన కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలించి ఆదివారం అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...

వైసీపీ (YCP) ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (MLC Ananta Udaya Bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇఫ్పటికే అనంతబాబును అరెస్ట్ చేశారు. ఆయన కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలించి ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. అనంతబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. అనంతబాబు సీఎం జగన్, మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి బినామీ అంటూ బాంబు పేల్చారు. వారి అండతోనే ఏజెన్సీలో గంజాయి, మైనింగ్ అంతా అనంతబాబు కనుసన్నల్లోనే జరుగుతుందని హర్షకుమార్ ఆరోపించారు.

అంతేకాదు అనంత బాబుకు చెందిన రహస్య డెన్ లు, ఇతర సంబంధాలు, గెస్ట్ హౌస్ లు, ఇతర ముఖ్యమైన విషయాలు సుబ్రహ్మణ్యంకు తెలుసని.. వాటి గురించి బయట మాట్లాడుతున్నాడని తెలిసే అతడ్ని హత్య చేశారని హర్షకుమార్ ఆరోపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది చదవండి: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం..


మరోవైపు అనంతబాబు అంశంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంపచోడవరం ప్రాంతంలో అనంతబాబు రౌడీయిజం చేస్తున్నారని.. ఆయన చెప్పిందే అక్కడ చట్టమంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అక్కడ ఎమ్మెల్యేగా గెలవాలన్న అనంతబాబు సపోర్ట్ ఉంటే చాలని.. ఆయన చెప్పిన వాళ్లే ఎమ్మెల్యేలైనా, ఇతర ఎన్నికల్లో అయినా గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న అనంత ఉదయభాస్కర్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మీడియా ముందు పెద్దగా కనిపించరు ఎమ్మెల్సీ.. ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తుంటారు.

ఇది చదవండి: మారువేషంలో ప్రజల్లోకి మంత్రి, ఎమ్మెల్యే.. పబ్లిక్ రియాక్షన్ ఇదే.. పరువు తీసిన ప్రయోగం..?


ఇదిలా ఉంటే అనంతబాబు గురించిన రహస్యాలు తెలిసుకున్నందుకే సుబ్రహ్మణ్యంను హత్య చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఐదేళ్లపాటు డ్రైవర్ గా పనిచేసిన యువకుడ్ని దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాయి. కేవలం రూ.20వేలు అప్పు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి హత్య చేసేంత వరకు వెళ్తారన్న అనుమానాలు రేకెత్తాయి. బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పినా.. దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అనంతబాబు చుట్టూ ఉచ్చుబిగిసింది.

ఇది చదవండి: ఏపీలో సంక్షేమ పథకాలకు కొత్త రూల్..,పెన్షన్, రేషన్ కార్డుదారులకు అలర్ట్


ఈ కేసులో తమను పోలీసులు వేధిస్తున్నారంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపించారు. పదేపదే ఇంటికొచ్చి స్టేషన్ కు రావాలని ఇబ్బంది పెడుతున్నారని.. నిత్యం ఇంటి చుట్టూ తిరుగుతుండటంతో భయమేస్తుందన్నారు. పోలీసుల తీరుపై జి.మామిడాడ గ్రామస్తులు మండిపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kakinada, Ysrcp