AP POLITICS EX MLA PULAPARTHI NARAYANA MURTHY PASSES AWAY DUE TO SUDDEN HEART STROKE IN AMALAPURAM FULL DETAILS HERE PRN
Ex MLA Passes Away: మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం.. కోనసీమలో విషాదం
పులపర్తి నారాయణ మూర్తి (ఫైల్)
కోనసీమ జిల్లా (Konaseema District) పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ (Ex.MLA Pulaparthi Narayana Murthy) మూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున నారాయణ మూర్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు.
కోనసీమ జిల్లా (Konaseema District) పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి (Ex.MLA Pulaparthi Narayana Murthy) హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున నారాయణ మూర్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గతంలో బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేసిన ఆయన.. 1996లో టీడీపీ (TDP) లో చేరి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో తన స్థానాన్ని బీజేపీ (BJP) కి కేటాయించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019లో టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి కూడా దూరమయ్యారు.
నారాయణ మూర్తికి భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న ఆయన వివాదాలకు దూరంగా ఉన్నారు. నారాయణ మూర్తి హఠాన్మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అనుచరులు, పి.గన్నవరం నేతలు పులపర్తికి నివాళులర్పించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.