Bojjala Gopalakrishna Reddy: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (EX minster Bojjala Gopala Krishna Reddy) మృతి.. ఆయనకు 73 ఏళ్లు ఆయన కాసేపటి క్రితం అపోలో ఆస్పత్రి (Apollo Hospital )లో గుండెపోటు (Heart Attack)తో మరణించారు.. వైద్యులు (Doctor) చికిత్స చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆయన మరణాన్ని వైద్యులు నిర్ధారించారు.. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. ముఖ్యంగా శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ (TDP) ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా బొజ్జలకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. రాజకీయాల్లో చాలా సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. అయితే గత కొంతకాలంగా ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. గత ఎన్నికల నాటికి ఆరోగ్యం సహకరించకపోవడంతో.. తన వారసుడ్ని రాజకీయాల్లోకి దింపారు.. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన ఆయన.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు.. అదే కాన్వాయ్ లో ఉండి.. ప్రాణాలతో బయటపడ్డారు. బ
బొజ్జల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. అలాంటి రాజకీయ నేతలు.. నేటి తరానికి చాలా అసవరం అన్నారు. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నిర్వహిస్తూ.. గర్వకారణంగా నిలిచారని.. ఆయనతో పని చేసిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను చాలా ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోయానని సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి : ఊ అంటున్నారా..? ఊఊ అంటున్నారా..? అధినేతకు అంతు చిక్కని గంటా అంతరంగం
అయితే ఇటీవలే బొజ్జలను చంద్రబాబు నాయుడు కలిసి పరామర్శించారు. ఇటీవల బొజ్జల బర్త్ డే రోజు విష్ చేసి ఉత్సాహపరిచారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు... హౌ ఆర్ యూ అంటూ పలుకరించారు. హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసిన చంద్రబాబు ఆయను ఉత్సాహపరిచారు. చంద్రబాబు రాకన చూసి.. చాలా ఉప్పొంగిపోయారు బొజ్జల.. ఆయన చివరి ఆనంద క్షణాలు అవే అంటున్నారు కుటుంబ సభ్యులు..
ఇదీ చదవండి : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీట్లపైనా పార్టీలకు క్లారిటీ
అయితే చాలా రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ చంద్రాబు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. దీంతో బొజ్జల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కేక్ కటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. బొజ్జలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు చంద్రబాబు కేక్ తినిపించారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలా యాక్టివ్ గా కనిపించిన ఆయన.. ఇప్పుడు గుండెపోటుతో మరణించడం పార్టీకి తీరని లోటు అంటున్నారు.. ఎందుకంటే టీడీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా.. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారి బొజ్జల ఒకరు.. చంద్రబాబు ఎక్కడ ఉంటే ఆయన కూడా అక్కడే ఉండేవారు.. అందుకు నిదర్శనే అలిపిరి ఘటనలో కూడా బొజ్జల ఉన్నారు.. అంటే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలాంటిందో చెప్పొచ్చు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP