Andhra Pradesh Political News: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పొత్తులకు సిద్ధమని ముందే సంకేతాలు ఇచ్చింది. జనసేన (Janasena) కూడా అందుకు సై అనే అంటోంది. ఇక క్లారిటీ ఇవ్వాల్సింది బీజేపీ (BJP) మాత్రమే.. బీజేపీ కూడా ఓకే అంటే.. ఆ మూడు పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీ (YCP) సింగిల్ గానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ (Congress)అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో వైఎస్సార్‌సీపీ (YSRCP)తో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన ప్రతిపాదన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy), మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) పీకే వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని, పొత్తులపై ముఖ్యమంత్రి జగన్ దే తుదినిర్ణయమని విజయసాయిరెడ్డి చెప్పగా, వైఎస్ఆర్ కుంటుబానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ తో ఎందుకు కలుస్తామని గుడివాడ వ్యాఖ్యానించారు. ఈ పొత్తులపై తాజాగా తాజా మాజీ మంత్రి.. పేర్ని నాని (Perni Nani) భిన్నంగా స్పందించారు.
ప్రశాంత్ కిషోర్ మా పార్టీకి కేవలం కన్సల్టెంట్ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలను మాత్రమే వాడుకుంటామన్నారు. అంతమాత్రాన ఆయన వైసీపీని శాశించినట్టు కాదన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రం.. మా ఎంపీల సంఖ్యా బలం అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతునిస్తామన్నారు. అలా మద్దతు ఇవ్వాలి అంటే ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ కూటమి కాగితంపై రాసి ఇస్తేనే మా మద్దతునిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య సినిమాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అసలు వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్నినాని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్‌ల (Pawan Kalyan)పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు వావివరసలు లేవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం చేసే పనిలో పదోవంతు తన అన్న కోసం పని చేయాలని సలహా ఇచ్చారు. మరోవైపు తనకు కేబినెట్ లో మళ్లీ చోటు దక్కకపోవడంపై స్పందించిన నాని.. ‘మంత్రి పదవి కన్నా నాకు జగన్ ఇస్తున్న గౌరవమే ఎక్కువ అన్నారు.
ఇదీ చదవండి : ఏపీలో పేదలకు బిగ్ షాక్.. ఫ్రీ రేషన్ లేనట్టే.. సర్కారు చేతులెత్తేసిందా?
తనకు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారన్న సంగతి గుర్తు చేశారు. అందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాను అన్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈనెల 27న సమావేశం జరగనుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Congress, Perni nani, Ycp