హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అధినేత ఇచ్చిన హామీ ఏమైంది..? అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి..?

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అధినేత ఇచ్చిన హామీ ఏమైంది..? అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి..?

కొడాలి నానికి అధినేత హ్యాండిచ్చారా..?

కొడాలి నానికి అధినేత హ్యాండిచ్చారా..?

Ex Minsters: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో ఉన్న సీనియర్లు అసహనంతో ఉన్నారా..? ముఖ్యంగా మాజీ మంత్రులు ఎంత కాలం ఈ నిరీక్షణ అని ఎదురు చూస్తున్నారా..? మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడే హామీ ఇచ్చిన.. అధినేత.. వారికి ఎందుకు పదవులు ఇవ్వడం లేదు..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gudivada, India

  Ex Minsters: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) లో ఆ మధ్య జరిగిన కేబినెట్ విస్తరణ రచ్చ ఇంకా ఆగడం లేదు. ఎందుకంటే అప్పుడు.. మంత్రులుగా తప్పించిన కీలక నేతలు అందరికీ.. పదవులు ఇస్తానని అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy) హామీ ఇచ్చారు.. అయితే ఆ కొత్త పదవులు మాట ప్రకటనకే పరిమితమైందా? ఆరుగురు మాజీలకు ఇంకా పట్టం కట్టకపోవడానికి కారణం ఏంటి? పదవుల కేటాయింపులో ఆలస్యానికి కారణం ఏమైనా ఉందా..? లేక ఆ పదవులు పూర్తిగా అటకెక్కినట్టేనా..? ఇంతకీ అధినేత వారికి ఇచ్చిన హామీలు ఏంటంటే...? ఈ ఏడాది ఏప్రిల్‌లో కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే అప్పటి వరకు జగన్ కేబినెట్ (Jagan Cabinet) లో కీలక మంత్రులుగా ఉన్నకొందరు మాజీలు అయ్యారు. తిరిగి ఎమ్మెల్యే పాత్రకే పరిమితం. అయితే వారి నుంచి నిరసనలు లేకుండా చూసుకునేందుకు మాజీలకు ఊరట కల్పించేలా కొన్ని ప్రకటనలు చేసింది అధికారపార్టీ. అందులో ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి బోర్డు (Andhra Pradesh State Devlopment Board) ఏర్పాటు. కేబినెట్‌ ర్యాంక్‌ హోదా కలిగిన ఆ పోస్ట్‌ను కొడాలి నానికి ఇస్తారని ప్రచారం జరిగింది. కమ్మ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకపోవడంతో.. అలా సర్దుబాటు చేస్తున్నారని చర్చ సాగింది. అయితే కొడాలి నాని (Kodali Nani)కి ఆ హామీ ఇచ్చి. నాలుగు నెలలు గడిచిపోయింది. రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఏర్పాటు ముందుకు కదలలేదు. దీనికి మెలిక పడిందని.. అందుకు ఆయనే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట.సాధారణంగా సీఎం జగన్‌ పట్ల వీర విధేయత చూపించే నేతల్లో కొడాలి నాని ఒకరు. అలాంటి నాయకుడిని మంత్రి పదవి నుంచి తప్పించి.. సాధారణ ఎమ్మెల్యేగా పరిమితం చేయడంపై పార్టీ వర్గాల్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయట. వాటిని పరిగణనలోకి తీసుకునే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు అప్పట్లో పార్టీ పెద్దలు ప్రకటించారు. రాష్ట్రంలో పునర్విభజన తర్వాత జిల్లాల సంఖ్య పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి బోర్డే కొలువు దీరితే.. వెనువెంటనే జిల్లా అభివృద్ధి బోర్డులు కొలిక్కి వస్తాయని అనుకున్నారు. అలాగే మాజీ మంత్రులకు జిల్లా అభివృద్ధి బోర్డు బాధ్యతలు అప్పగిస్తారని.. తద్వారా ప్రొటోకాల్ సమస్య కూడా ఉత్పన్నం కాదని పార్టీ పెద్దలు చెబుతూ వచ్చారు.


  ఈ బోర్డులు, మండళ్ల విధి విధానాలు, స్వరూపం ఏంటో, ఎంత మందితో కూర్పు ఉంటుందో స్పష్టత లేదు. అన్నీ ప్రకటనలు.. చర్చల్లోనే ఉండిపోయాయి. దీనికి మాజీ మంత్రి కొడాలి నాని కారణమని పార్టీలో ప్రచారం జరుగుతోందట. ముందు నుంచీ రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌ పదవి పట్ల ఆయనకు ఆసక్తి లేదనే ప్రచారం ఉంది. మంత్రి పదవి.. లేదంటే ఎమ్మెల్యే గిరి అనే ఈక్వేషన్‌తోనే కొడాలి నాని వెళ్తున్నారు. ఆ విషయాన్ని మంత్రి పదవి పోయాక స్వయంగా ఆయనే చెప్పారు. తనను మాజీ మంత్రి అని పిలవొద్దని.. గుడివాడ ఎమ్మెల్యేగానే చూడాలని స్పష్టం చేశారు.
  ఇదీ చదవండి : మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..
  అయితే కొడాలి నాని ఎంచుకున్న ఈ వైఖరి కారణంగానే ఏపీ అభివృద్ధి మండలి ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాల అభిప్రాయంగా ఉందట. దాంతో జిల్లాల్లో బోర్డుల ఏర్పాటుకు ఎసరొచ్చిందని భావిస్తున్నారట. రాష్ట్ర బోర్డే ఏర్పాటు కాకపోతే.. జిల్లా బోర్డులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్న. ఈ విషయం బయటకు చెప్పుకోకపోయినా.. ఆ పదవి ఆశిస్తోన్న మాజీ మంత్రులు లోలోన ఆవేదన చెందుతున్నారని వారి అనుచరులే చెవులు కొరుక్కుంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kodali Nani, Ycp

  ఉత్తమ కథలు