Kodali Nani: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటలు మంట పెడుతున్నాయి. తాజాగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని నందమూరి అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ (YSRCP Plenary) సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో పేర్ని నాని (Perni Nani) పోటీ చేసినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (Perni Krishnamurthy) బరిలో ఉన్నా.. అందరూ అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని కాదని అన్నారు. వారసత్వమంటే కొంతమందికి అర్థాలు కూడా తెలియడం లేదన్నారు. తాత, తండ్రి, కొడుకు అన్నయ్య, తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు. కానీ మామా, అల్లుళ్లకు వారసత్వం ఎలా వస్తుందన్నారు. వారసత్వమంటే వైఎస్సార్.. జగన్. సీనియర్ ఎన్టీఆర్ (NTR) జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) . మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు. రాష్ట్రంలో చంద్రబాబు (Chandrababu) , బందరులో కొల్లు రవీంద్ర (Kollu Ravindra) లాంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబు ఎప్పటికీ కాలేడని.. మనవడు ఎన్టీఆరే అసలైన వారసుడంటూ కొత్త చర్చకు తెరలేపారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ కొడాలి ఆరోపించారు. ఆయన కుమారుడు లోకేష్ ఎక్కడ ఎవరు చనిపోయినా టీడీపీ కార్యకర్త అంటూ తిరుగుతున్నాడని అన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలతో ఒళ్లంతా కుళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని రథాలను తగలబెట్టడం, విగ్రహాలను పగల గొట్టడం చేశారంటు విమర్శించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కోనసీమ చిచ్చు రేపారని.. ఎమ్మెల్యే, మంత్రి ఇల్లు తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మద్యంలో విషం అంటూ ప్రచారం మొదలెట్టారన్నారు. అరబిందో ఫార్మా 1964లో స్థాపించారని. ఏపీతో పాటు వివిధ ప్రాంతాల్లో 24 మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వారు ఎగుమతి చేస్తారు. అలాంటి కంపెనీ ఎన్ని ప్రమాణాలు తీసుకుంటుందో ఆలోచించాలి అన్నారు. ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణ పరిస్థితి ఉంటుందని. దాన్ని బట్టి మందులు తయారు చేస్తారన్నారు. వాళ్లు విషం కలిపితే అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారని.. దానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. విజయసాయిరెడ్డి వియ్యంకుడుది కాబట్టి విషం కలిపారు అని ఆరోపణ చేయడం దారుణం అన్నారు. అరబిందో జగన్ బినామీలు అంటాడు.. వాళ్ళు ఎప్పటినుంచి కోటీశ్వరులు?. చారిటబుల్ ట్రస్ట్ పెట్టీ ప్రజలకు సేవ చేస్తున్న వారిని బినామీలు అంటారా అంటూ కోడాలి ప్రశ్నించారు.
ఆ పాలల్లో విషం కలపడానికి చంద్రబాబుకు సిగ్గులేదా?
చంద్రబాబు, ఆయన త్త పుత్రుడు, దుష్ట చతుష్టయం తన వెంట్రుక కూడా పీకలేరు అన్న మా నాయకుడి మాటకు తామంతా కట్టుబడి ఉన్నామన్నారు. జగన్ ప్రజలను నమ్మి వచ్చారని.. ఈ రోజు సీఎంగా ఉన్నారు.. నీ ఆటలు ఒకప్పుడు నడిచాయి.. ఇప్పుడు నడవవు అన్నారు. తమిళనాడు, కేరళలో హెరిటేజ్‌ని 2012లో బ్యాన్ చేశారు. దాంట్లో విషం ఉంది. పిల్లలకు మెదడుకు సమస్య అని నిషేధించారు. చిన్నపిల్లలు తాగే పాలల్లో విషం కలపడానికి చంద్రబాబుకి సిగ్గులేదా? అని కొడాలి నాని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gudivada, Kodali Nani