Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINSTER KODALI NANI SLAMS PAWAN KALYAN AND NARA LOKESH ABOUT 10 EXAM RESULT NGS

Kodali Nani:మీలా తయారు చేస్తారా..? జూమ్ మీటింగ్ కు హాజరుపై కొడాలి వివరణ.. ఏమన్నారంటే..

నాారా లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ

నాారా లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ

10th Result: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలపై దుమారం ఆగడం లేదు. ఆ వివాదం రచ్చ అవుతుండగానే.. జూమ్ వివాదం దుమారం రేపుతోంది. టీడీపీ నేత లోకేష్ నిర్వహించిన జూమ్ లోకి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎంటర్ అవ్వడం వివాదానికి కారణమవుతోంది. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
    Ex Minster kodali Nani:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదవ తరగతి పరీక్షల ఫలితాల (10th Exam Result) పై దుమారం అంతకంతకూ పెరుగుతోంది.  ఏపీ ప్రభుత్వం (AP Government) అసమర్థతే కారణంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప పాస్ పర్సెంటేజ్ వచ్చిందని విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. దీనికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minster Botsa Satyanarayana) నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై తప్పు నెట్టడం దారుణమంటున్నారు. ఇటీవల జనసేన  (Janasena)  అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఘాటుగానే స్పందించారు.  పది గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పవన్ డిమాండ్ చేశారు. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శ నారా లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చించి.. భరోసా ఇచ్చారు.. అయితే ఈ మీటింగ్ లో అకస్మాత్తుగా మాజీ మంత్రి కొడాలి నాని.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎంటర్ అవ్వడం వివాదాస్పదమవుతోంది. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

    ఈ వివాదంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవాలని చూడటం దారుణమని నాని మండిపడ్డారు. అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి ఆత్మహత్యలు చేసుకునేలా నారా లోకేశ్‌ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయవద్దని చెప్పేందుకు లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పాల్గొన్నానని వివరణ ఇచ్చారు.



    లోకేశ్ మాత్రం తాము చెప్పింది వినకుండా మీటింగ్ కట్ చేశారని చెప్పారు. లోకేశ్(Lokesh) తో బహిరంగ చర్చకూ తాను సిద్ధమేనని కొడాలి నాని ఛాలెంజ్ స్వీకరించారు. విద్యార్థులను నెలరోజులు చదివించి వారి సామర్థ్యాలు పెంచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కొడాలి నాని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాస్తే తప్పకుండా పాస్‌ అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : మళ్లీ పవన్ పై పడ్డ ఆ మాజీ మంత్రి.. పది ఫెయిలైన వారంతా మీ అభిమానులే అంటూ సెటైర్

    కరోనా కారణంగా రెండేళ్లుగా 8, 9 తరగతులు సరిగా జరగలేదు. దీంతో పాస్ పర్సంటేజ్ తగ్గిపోయింది. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగలేదు. దీంతో ఉత్తీర్ణతశాతం పడిపోయింది. కానీ దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాస్తే డైరెక్ట్‌గా పాసైనట్లు సర్టిఫికెట్ ఇస్తాం. వారిని ఇప్పుడు పాస్ చేసినా.. ఇంటర్‌లో మళ్లీ తప్పుతారు. పిల్లలకు పది గ్రేస్ మార్కులు వేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. గ్రేస్ మార్కులు ఎందుకు? గ్రేస్ మార్కులు వేస్తే.. ఆ విద్యార్థులు కూడా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లా తయారవుతారని ఆరోపించారు.

    ఇదీ చదవండి : మూడు మతాల పవిత్ర స్థలాలు ఒకే చోట.. అక్కడకు వెళ్తే అందో అందమైన అనుభూతి.. ప్రత్యేకత ఏంటంటే?

    సాధారణంగా కరోనాతో సరిగ్గా తరగతులు జరగనందున పిల్లల్లో విషయాన్ని గ్రహించే సామర్ధ్యం తగ్గిపోయిందన్నారు. దీంతో రెండు లక్షల మంది ఫెయిల్‌ అయ్యారని చెప్పారు. వారి సామర్థ్యాలు పెంచేందుకు సీఎం జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కొడాలి నాని స్పష్టం చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Nara Lokesh, Pawan kalyan, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు