హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

పవన్, చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

పవన్, చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై అక్రమ కేేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? తనకు సంబంధం లేని కేసులో ఇరుకించాలని కుట్రలు చేస్తున్నారా? రాజకీయ ప్రత్యర్థులు ఈ దిశలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Kodali Nani: తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster Kodali Nani) అనుమానం వ్యక్తం చేస్తారు. అసలు గుడివాడ (Gudivada) లో క్యాసినో (Casino) జరగలేదని ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.  చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) కేసును లింక్ చేస్తూ.. తనపై ఈడీ.. ఐటీ దాడులు జరిపే ప్రయత్నాలు.. రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారని  ఆరోపించారు. తనతో పాటు మరో నేత పేరు చెప్పమని..  ప్రవీణ్ పై కొందరు ఒత్తిడి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై గతంలో ప్రవీణ్ సైతం క్లారిటీ ఇచ్చారు. వైసీపీ (YCP) తో తనకు సంబంధం లేదని.. కావాలని కొందరు తనను బెదిరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తాజాగా కొడాలని నాని సైతం అదే వ్యాఖ్యలు చేయడం.. సంచలనంగా మారింది.

మరోవైపు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party ) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సహా.. విపక్షాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.  తెలుగు దేశం పార్టీ రోజూ ఎదో ఒక కుట్ర చేయాలని ప్లాన్లు వేస్తోందని మండిపడ్డారు. తన రాజకీయ అవసరం కోసం చంద్రబాబు నాయుడు.. మతాలపైనా దుష్ప్రచారం చేస్తారని ఆరోపించారు. గతంలో అసెంబ్లీ వేదికగా తన భార్యను ఏదో అన్నామని చంద్రబాబు ఏడుస్తూ డ్రామాలు క్రియేట్ చేశారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా నీచ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు అని ఆరోపించారు.  ప్రజల్లో తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే.. బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అటు జనసనేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పైనా తీవ్రంగా మండిపడ్డారు.. జనాలను ఉద్దరిస్తాను అని చెప్పే ఆయనకు.. చంద్రబాబు జపం చేయాల్సిన ఖర్మ ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు.. చరిత్ర ఉన్న కుటుంబంలో ఉన్నారు.. మెగాస్టార్ లాంటి అన్న ఉన్నారు.. అయితే సొంత ఎజెండా పెట్టుకోకుండా.. చంద్రబాబు ఎజెండాతో రాజకీయాలు ఎందుకు చేయాలి అంటూ మండిపడ్డారు.

ఇదీ చదవండి : టీచర్ గా మారిన బాలయ్య.. సోషల్ మీడియాతో కాలక్షేపంపై తనదైన స్టైల్లో వార్నింగ్

లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్ పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసి.. ప్రజలు నమ్మకుండా అధికారం కట్టబెట్టారని కొడాలి నాని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు.. ఆయన కుమారుడు ఎంత ప్రచారం చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వారం రోజుల్లో ఏదో జగన్ వ్యవహారం బయట పెడతానని లోకేష్ అంటున్నారని.. అదెదో మొన్న మంగళవారమే ఉత్తర కుమారుడు బయట పెట్టుచ్చుకదా అని ప్రశ్నించారు..

First published:

Tags: Andhra Pradesh, AP News, Gudivada, Kodali Nani, Praveen

ఉత్తమ కథలు