Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINSTER KODALI NANI SLAMS ON PAWAN KALYAN AND CHANDRABABU ON ROAD ISSUES NGS

Kodali Nani: ఒక్కటి చూపించండి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కొడాలి నాని ఛాలెంజ్

పవన్, చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

పవన్, చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై రచ్చ రచ్చ అవుతోంది. గుడ్ మార్నింగ్ సిఎం సార్ అని జనసేన ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే.. బ్యాడ్ మార్నింగ్ అంటూ.. వైసీపీ కౌంటర్లు ఇస్తోంది. తాజాగా ఈ రచ్చలోకి మాజీ మంత్రి.. కొడాలి నాని ఎంటర్ అయ్యారు. జనసేన నేతలకు సవాల్ విసిరారు.. అలాంటిది ఒక్కటి చూపించినా.. రాజకీయాల నుంచి తప్పించుకుంటాను అంటున్నారు.

ఇంకా చదవండి ...
  Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రోడ్ల దుస్థితి దారుణంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా (Social Media) కోడై కోస్తోంది. లక్షలాది ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సారధ్యంలోని పార్టీ రెండేళ్లుగా వివిధ రూపాల్లో రోడ్ల సమస్యలపై పోరాటం చేస్తోంది. గతేడాది శ్రమదానం పేరుతో రహదారుల దగ్గర నిరసన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన నిర్వహించారు. రాష్ట్రం గుంతలు పడిన రహదారుల దగ్గర ఫోటోలు దిగి గుడ్ మార్నింగ్ సీఎం సార్ (Good Morning CM Sir) అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ సోషల్ మీడియా పోస్టు చేశారు. దీనికి కొన్ని వ్యంగ్య కార్టూన్లు కూడా పోస్టు చేయడంతో ట్విట్టర్‌లో ఇదో ట్రెండింగ్‌గా మారింది.. దానికి తోడు ప్రస్తుతం వర్షాలతో రోడ్ల మరింత అధ్వానంగా మారడంతో సోషల్ మీడియాలో ఫోటోలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి రోడ్డులపై ఎలా ప్రయాణం చేయాలని నిలదీస్తున్నారు. అలాగే హెలికాఫ్టర్‌లో తిరిగే ముఖ్యమంత్రికి రాష్ట్ర రహదారుల గురించి ఎలా తెలుస్తుంది అంటూ పోస్టులు పెడుతున్నారు. జనసేన ఆరోపణలను అధికార వైసీపీ (YCP) అదే స్థాయిలో తిప్పికొడుతోంది. బ్యాడ్ మార్నింగ్ పేరుతో కౌంటర్ కార్యక్రమం చేపట్టింది. బాగా ఉన్న రోడ్ల దగ్గర ఫోటోలు దిగి షేర్ చేస్తున్నారు. ఇలా రోడ్లపై విపరీతంగా చర్చ జరుగుతుంటే మాజీమంత్రి కొడాలి నాని ఎంటర్ అయ్యారు.

  పవన్ తో సహా జనసేన నేతల విమర్శలను ఆయన ఖండించారు.. అంతేకాదు ఛాలెంజ్ కూడా చేశారు. ఆయన ఏమన్నారంటే.. గుంతలు లేని రోడ్లను భారతదేశంలో ఎక్కడ చూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు సవాలు విసిరారు. లక్షల రూపాయలతో రోడ్లు వేసినా 10 నుంచి 20 శాతం మేరకు గోతులు ఉండటం సహజమన్న నాని, మనదేమి అమెరికా కాదని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ గడ్డం, జుట్టుతో కనిపించే నాని.. తాజాగా డిఫ్రంట్‌ లుక్‌లో కనిపించడంతో ఆయన లుక్ పైనా సోషల్ మీడియాలో మీక్స్ దర్శనమిస్తున్నాయి.  ఇటీవలే తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు. గుండు, క్లీన్‌ షేవ్‌తో నాని భిన్నంగా కనిపించారు. స్టైల్ మారినా ఆయన మాటల్లో మాత్రం దూకుడు తగ్గలేదు. ఎప్పటిలాగానే చంద్రబాబు, పవన్‌ లపై విరుచకు పడ్డారు. వరదల్లో లంక గ్రామాలు ఇబ్బంది పడ్డాయి. ప్రభుత్వం పునరావాస ఏర్పాట్లు చేసింది. ప్రతీ వరద బాధిత కుటుంబానికి 2 వేలు రూపాయలు ఇస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయంగా చంద్రబాబుకి ఫుడ్డు లేదు.. పవన్, లోకేష్ లకి పాలు లేవు. అందకే ఇలా దిక్కుమాలిన రాజకీచాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

  ఇదీ చదవండి : 11 మంది కాదు.. అంతకుమించే? నిత్య పెళ్లికొడుకు కేసులో నమ్మలేని నిజాలు ఎన్నో?

  పశువులు, పంటలు దెబ్బ తింటే లెక్కలు తీయమని సీఎం చెప్పారు. ఈ ప్రభుత్వం మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ పనికిరాని 420 గాళ్లకి ప్రజలే బుద్ధి చెప్తారని నాని అభిప్రాయపడ్డారు. రెండు రోజులు షూటింగ్ ఉండదనుకుంటా.. గుడ్ మార్నింగ్ సీఎంని మొదలెట్టాడు. ఇదేం అమెరికా, సింగపూర్, మలేషియా కాదు, అన్ని లక్షల కోట్లు పెట్టి రోడ్లేసినా పోయే రోడ్డు పోతూనే ఉంటుందంటూ సరికొత్త అర్థం చెప్పారు. సినిమాలు చేసుకుంటూ ఉండే వాళ్లకి గ్రామాల గురించి ఏం తెలుస్తుందని అభిప్రాయపడ్డారు కొడాలి నాని.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kodali Nani, Powe star pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు