Kodali Nani: గడప గడపకు వైసీపీ అన్న కార్యక్రమం చివరి నిమిషంలో గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) గా మారింది. పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు వైసీపీ (YCP) ఎమ్మెల్యేలంతా ఇకపై జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గడపగడపకు వైసీపీ అని తొలుత డిసైడ్ చేసారు. కానీ, లాస్ట్ మినిట్ లో గడప గడపకు ప్రభుత్వంగా పేరు మార్చారు. కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వం.. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కావటంతో..ఇక, ఎన్నికల వరకు ఎమ్మెల్యేలతో సహా.. పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా.. ఆ ఇంటికి అందుతున్న పథకాలు.. లబ్ది గురించి తెలుసుకోనున్నారు. పథకాలు అందించడంతో పాటు.. ప్రతి ఇంటికీ జగన్ రాసిన లేఖను ఎమ్మెల్యే అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజే కొందరు ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపించాయి.
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం తొలిరోజు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసన తప్పడం లేదు. ఇంటింటికి వెళ్ళిన కొందరు అధికార పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. వివిధ అంశాలపై ప్రజలు నేతల్ని నిలదీస్తున్నారు. గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మీర్జాపురంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు నిలదీశారు.
Gadapa Gadapaki Government || గడప గడపకు ప్రభుత్వం తొలి రోజే అధికార పార్ట... https://t.co/G6iaU30XBY via @YouTube #YCP #YSRCP #YsrcpLootingApPeople #YSRPensionKanuka #CMYSJagan #GadapaGadapakuManaPrabhuthvam #GadapaGadapakuYSRCP #TDPMembershipDrive2022 #TDP
— nagesh paina (@PainaNagesh) May 11, 2022
మరికొందరు ఉపాధిహామీ పనుల కూలీలు రాలేదని కొందరు, రోడ్డు వేయించమని మరికొందరు నేతలపై తిరుగుబాటుకి దిగారు. కర్నూలు జిల్లా హత్తిబెళగల్‌లో మంత్రి గుమ్మనూరు జయరాంని సమస్యలపై మహిళలు నిలదీశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి (Ex Minster Kodali Nani) నాని
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు.
Gadapa Gadapaku YCP || గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం తొలి రోజు మంత్రులక... https://t.co/iuG7OomEZV via @YouTube #YCP #YsrcpLootingApPeople #YSRPensionKanuka #JaganFailedCM #GadapaGadapakuManaPrabhuthvam #GadapaGadapakuYSRCP #GadapaGadapakuManaPrabhutvam
— nagesh paina (@PainaNagesh) May 11, 2022
ప్రభుత్వ వ్యతిరేకతపై స్పందించిన కొడాలి నాని.. జగన్ బతికున్నంత కాలం ఆయన సీఎంగానే ఉండాలని, ఆయన కోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని సూచించారు. ఒకవేళ జగన్ సీఎం కాకపోయి ఉంటే? పేదలు ఇళ్లు లేక అల్లాడిపోతుండే వారన్నారు. డిసెంబర్ 21న జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. గుడివాడ (Gudivada) లో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా.. వచ్చే ఎన్నికలు.. అంటే.. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. కేవలం పనీపాట లేకే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని నాని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Kodali Nani, Ycp