హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani:జూనియర్ ఎన్టీఆర్ ను అంత అవమానించారా..? చంద్రబాబు తీరుపై కోడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani:జూనియర్ ఎన్టీఆర్ ను అంత అవమానించారా..? చంద్రబాబు తీరుపై కోడాలి నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ట్రెండ్ సెంటర్ గా మారారు. ఆయన రాజకీయాలపై స్పందించనప్పటికీ.. ఆయన చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయల్లో ఇప్పుడు అంతా ఎన్టీఆర్ జపమే చేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) మాత్రం ఏదో ఒక రూపంలో ఎన్టీఆర్ (NTR) ను లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం చేస్తోంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ని నడిపే సమర్థ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కే ఉందని.. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) .. నారా లోకేష్ (Nara Lokesh) ఇద్దరూ తెలుగు దేశం పార్టీని విడిచి కొత్త పార్టీ పెట్టుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలంతా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster kodali Nani) అయితే మరో అడుగు ముందుకు వేసి.. జూనియర్ ఎన్టీఆర్ లక్షణాలు..శక్తి సామర్ధ్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడి మనవడిగా జూనియర్ కు పూర్తిగా తాత సీనియర్ ఎన్టీఆర్ హాహభావాలు అచ్చం వచ్చేశాయని అభిప్రాయపడ్డారు. ప్రజలను ఆకర్షించడంలో.. తెలుగు దేశం పార్టీలో ఎవరూ యంగ్ టైగర్ కు దరిదాపుల్లో కూడా లేరని అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్యన ప్రసంగాల్లో ధీటుగా.. ఎక్కడా పొరపాటు లేకుండా చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగల నైపుణ్యం ఉందని కొడాలి నాని అన్నారు.

  జూనియర్ ఎన్టీఆర్ కు 9 బాషల్లో పట్టు ఉందని.. తనకు జూనియర్ తో ఉన్న పరిచయం.. సంబంధాలతో చాలా దగ్గరగా చూసాను అన్నారు. తాతకు తగ్గ మనడు తారక్ అంటూ ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తొమ్మది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని వెల్లడించారు.

  తెలుగు..తమిళం..కన్నడ..మళయాళం..ఉర్దూ.. ఇంగ్లీషు.. స్పాన్..హిందీ భాషల్లో ఎక్కడా ఎలాంటి రిఫరెన్స్ లేకుండా మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. పెన్ లేకుండా.. పుస్తకం చూడకుండా మాట్లాడుతారని వివరించారు. ఆరు నెలల సమయం ఇస్తే మరో ఆరు నెలల్లో మరో ఆరు బాషలు నేర్చురోగల సమర్ధత జూనియర్ కు ఉందని అభిప్రాయపడ్డారు.

  ఇదీ చదవండి : స్నేహితుడి భార్యపై మోజు పడ్డాడు.. ఆమె కూడా ఒకే అంది.. చివరకు ఏమైంది అంటే?

  బీజేపీ వినియోగించుకుంటుంది ముఖ్యమంత్రి జగన్ కు ప్రధానితో పాటుగా ఎవరి అప్పాయింట్ మెంట్ అయినా 72 గంటల్లో దొరుకుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు మూడేళ్లుగా ప్రధాని మోదీ - అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని, అయినా సాధ్య పడలేదన్నారు. ప్రధాని మోదీ - షా రాజకీయంగానే ఆలోచనలు చేస్తారని.. నిఘా వర్గాల సమాచారం మేరకే జూనియర్ ఎన్టీఆర్ తో వారు సమావేశం అయ్యారని కొడాలి కామెంట్ చేశారు.

  ఇదీ చదవండి : వెంట వెంటనే రంగులు మారుతున్న బంగాళాఖాతం.. కారణమిదే అంటున్న సైంటిస్టులు

  అలాగే లోకేష్ ప్రచారం చేస్తే పార్టీకి నష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ను ఉపయోగించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అన్ని భాషల మీద అంత పట్టు ఉన్న వ్యక్తి మరెవరూ దక్షిణ భారత దేశంలోనే లేరన్నారు కొడాలి నాని . అయితే జూనియర్ ను చంద్రబాబు తొక్కేస్తున్నారని తెలియడంతోనే.. ఎన్టీఆర్ ను బీజేపీ దగ్గర చేసుకుందని.. అది ఆ పార్టీ తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు.

  ఇదీ చదవండి : మీ అమ్మాయికి మంచి అమెరికా సంబంధం వచ్చిందని మురిసిపోతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత తారక్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం వేదిక పైన పవన్ ను పక్కన కూర్చొబెట్టుకొని.. జూనియర్ ను గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తెలుసన్నారు. దీంతో..అమిత్ షా అన్నీ తెలుసుకొనే జూనియర్ తో భేటీ అయ్యారని చెప్పారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Jr ntr, Kodali Nani

  ఉత్తమ కథలు