Amit Shah with jr NTR: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ సమావేశం హాట్ టాపిక్ అయ్యింది.. అయితే ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను అభినందించడానికే అమిత్ షా భీంను కలిశారని.. బీజేపీ నేతలు అంటున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు.. ఇతర పార్టీ నేతలు సైతం ఈ భేటీ వెనుక రాజకీయ ప్రాధాన్యం ఉందని అంటున్నారు. అయితే తాజాగా ఈ సమావేశంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి అమిత్ షా లు.. అవసరం లేదు అనుకుంటే.. ఒక్క నిమిషం కూడా ఎవరితోనే సమావేశం కారని అభిప్రాయపడ్డారు..
ఇంకా ఏమన్నారంటే..? ఎన్టీఆర్ తో బీజేపీ తన బలాన్ని.. పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. ఆయన క్రేజ్ ను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాలన్నదే బీజేపీ ప్లాన్ అన్నారు కొడాలి నాని.
అయితే ఈ భేటీ కోసం అమిత్ షా తన షెడ్యూల్ ను సైతం మార్చుకున్నారు అంటే.. జూనియర్ ఎన్టీఆర్ కు కేంద్ర మంత్రి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అన్నది అర్థం చేసుకోవచ్చు.. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అక్కడికి వచ్చారు. ముందుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్ శాలువా కప్పి సత్కరించారు. వీరిమధ్య మొత్తం 45 నిమిషాల సేపు సమావేశం సాగింది. ఆ సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం భేటీ.. ఈ అరగంటలో ఏం చర్చించారంటే?
మరో విషయం ఏంటంటే..? జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశ విషయాన్ని అమిత్ షా స్వయంగా తన ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది అంటూ ట్వీట్ చేశారు.
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
— Amit Shah (@AmitShah) August 21, 2022
స్వయంగా అమిత్ షా ఈ మాటలు అన్నారు అంటే ఎన్టీఆర్ కు బీజేపీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.. ఈ భేటీపై ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నా.. జూనియర్‌తో భేటీ సందర్భంగా అమిత్‌షా సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
అలాగే ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ సినిమాలు తాను చూశానని అమిత్ షా చెప్పారని టాక్. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేసేవారని అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Andhra Pradesh, AP News, Jr ntr, Kodali Nani