హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: సింహం సింగిల్ కానీ ఈ సారి తీన్మారే.. పుత్రుడు, దత్త పుత్రుడు.. చంద్రబాబునీ ఓడిస్తాం..? రాసి పెట్టుకోండి

Kodali Nani: సింహం సింగిల్ కానీ ఈ సారి తీన్మారే.. పుత్రుడు, దత్త పుత్రుడు.. చంద్రబాబునీ ఓడిస్తాం..? రాసి పెట్టుకోండి

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Kodali Nani: 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? అధికార వైసీపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా..? విపక్షాల పొత్తు వైసీపీని డ్యామేజ్ చేస్తుందా..? గ్రాఫ్ పెరిగేలా చేస్తుందా..? గత ఎన్నికల్లో ఓడిన పవన్, లోకేష్ పరిస్థితి ఏంటి..? వీటన్నింటిపైనా ఘాటుగా స్పదించారు మాజీ మంత్రి కొడాలి నాని ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...

Kodali Nani: సింహం సింగిల్ గానే వస్తుంది.. ప్రతిపక్షాలన్నీ గుంపులుగా వచ్చినా డొంట్ కేర్ అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster Kodali Nani).. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. ముఖ్యంగా పొత్తుల అంశం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. పొత్తులపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) త్యాగాలకు సిద్ధం అంటుంటే..? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పొత్తులపై చర్చ అవసరం అంటున్నారు. ఇలా ఇద్దరు కలిసి పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీ (BJP) మాత్రం పవన్ తోనే మా ప్రయాణం.. టీడీపీ వద్దే వద్దు అంటున్నారు.. ఇలా విపక్షాలు పొత్తుల గురించి ఎవరి వాదన వారు వినిపిస్తుంటే..? సీఎం జగన్ (CM Jagan) అనే సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతుందని వైసీపీ నేతలు తొడలు కొడుతున్నారు. అక్కడితో ఆగడం లేదు.. దమ్ముంటే చంద్రబాబు, పవన్ లు కూడా సింగిల్ గా రావాలి అంటూ సవాల్ విసురుతున్నారు. తాజాగా ఈ పొత్తులపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెలరేగారు. మంత్రి పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత తొలిసారి.. అది కూడా సీఎం జగన్ తో భేటీ తరువాత.. తనదైన స్థాయిలో టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు.

నిన్న మొన్నటి వరకూ టీడీపీకి దొంగ చాటుగా పవన్ కళ్యాణ్ పని చేశారని కొడాలి నాని ఆరోపించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించింది కూడా చంద్రబాబు కోసమే అన్నారు. 2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికి వేరుగా పోటీ చేసినట్టు నటించారని అన్నారు. 2014 నుండి పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారని.. చివరి వరకూ కలిసే ఉంటారని కొడాలి నాని తేల్చి చెప్పారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా జగన్ సింహంలా రెడీగా ఉన్నారని అన్నారు. ఎవరెన్ని ప్రయాత్నాలు చేసినా.. కుట్రలకు తెరలేపినా..? 55 శాతం ఓటింగ్ జగన్ దే అంటున్నారు కొడాలి నాని.. ఆ మిగిలిన 45 శాతం ఓటింగ్ కోసం విడి విడిగా కొట్టుకుంటారో.. కలిసి వస్తారో మీ ఇష్టం అంటూ ఆఫర్ ఇస్తున్నారు. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ కి వ్యతిరేకత ఉంటే ఇంకొకరితో పొత్తులు ఎందుకు? దమ్ముంటే సింగిల్ గా రా? అని సవాల్ విసిరారు కొడాలి నాని.

ఇదీ చదవండి : సైకిల్ మీద వచ్చి ప్రశ్నిస్తున్నారని లైట్ తీసుకున్నారు.. విషయం తెలిసి పరుగులు పెట్టారు?

చంద్రబాబు, పవన్ లకు 2024 ఎన్నికలే చివరివి అని, జగన్ చేతిలో చావు దెబ్బ తింటారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకి అధికారం కావాలి, పవన్ కి డబ్బు కావాలన్నారు. పవన్, లోకేష్ లు ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలని.... ఆ తరువాతే ఏదైనా మాట్లాడండి అంటూ సలహా ఇచ్చారు. జగన్ సారథ్యంలో ఈ సారిపుత్రుడిని, దత్త పుత్రుడినే కాదు.. చంద్రబాబునీ ఓడిస్తామన్నారు కొడాలి నాని.

ఇదీ చదవండి : ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో.. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అయనదే అన్న సజ్జల

కేబినెట్ పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన త‌ర్వాత కొడాలి నాని తొలిసారిగా సీఎం జ‌గ‌న్‌తో సమావేశం అయ్యారు. మంత్రి ప‌ద‌విని కోల్పోయిన కొడాలి నాని ప్ర‌స్తుతం వైసీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉన్నా.. ఏపీలో అప్పుడే ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల్లో పొత్తుల దిశ‌గా టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల నుంచి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుండ‌టం, వాటిపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్‌తో కొడాలి నాని భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Kodali Nani, Pawan kalyan

ఉత్తమ కథలు