AP POLITICS EX MINSTER KODALI NANI REJECT TO CM JAGAN LATEST OFFER WHY HE IS REJECTED NGS
Kodali Nnai: సీఎం జగన్ ఆఫర్ ని తిరస్కరించిన మాజీ మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..?
కొడాలి నాని (ఫైల్)
Kodali Nnai: జగన్ అంటే వీర అభిమానం చూపించే వారిలో కొడాలి నాని ఒకరు.. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనేవారు.. అయితే సీఎం జగన్ కొత్త కేబినెట్ లో కొడాలికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో మాజీ మంత్రి అయ్యారు. కానీ ఆయన కోసం కీలక పదవిని సీఎం జగన్ ఆఫర్ చేసేందుకు సిద్ధమయ్యారు.. కానీ కొడాలి నాని దాన్ని తిసర్కరించినట్టు టాక్.? ఎందుకో తెలుసా..?
Kodali Nnai: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి అత్యంత సన్నిహితుడైన వారిలో కొడాలి నాని (Kodali Nani ) ఒక్కరు. అంతేకాదు అధినేత అంటే కొడాలి నాని కూడా అంతే అభిమానిస్తారు. అధినేతే జగన్ కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమంటారు.. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ సైనికుడుగానే ఉంటానని.. మిగిలిన నేతలు కూడా జగన్ వెంటే నడవాలని పిలుపు ఇస్తారు.. అంతా జగన్ పై ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. అధినేత సైతం ముందే చెప్పినట్టు తన కేబినెట్ ను రెండున్నరేళ్ల తరువాత మార్చారు. మొదట కేవలం ఇద్దర్ని మాత్రం కొనసాగించి.. మిగిలిన వారిని తప్పిస్తారని ప్రచారం జరిగింది. దీంతో మూకుమ్మడిగా మంత్రులందరూ రాజీనామా చేశారు. అయితే అనూహ్యంగా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సామాజిక సమీకరణలో నేపథ్యంలో పాత వారిలో 11 మందిని కొనసాగించి 14 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఆ 11 మందిలో కొడాలి నానికి ప్లేస్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కేవలం జగన్ వీర విధేయుడిగనే కాకుండా.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సమాజిక వర్గానికి చెంది.. వైసీపీలో ఉన్న కీలక నేత కొడాలి నాని ఒక్కరే.. ఆ లెక్కన చూసినా కొడాలికి మంత్రి పదవి ఇవ్వాలి.. కానీ జగన్ మనసులో ఎలాంటి లెక్కలు ఉన్నాయో ఏమో.. కొడాలి నాని కాదని.. అనూహ్యంగా క్రిష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ (Jogi Ramesh) కు మాత్రమే అవకాశం ఇచ్చారు. గత కేబినెట్ లో అవకాశం దక్కిన కమ్మ - క్షత్రియ - వైశ్య వర్గాలకు ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో..కేబినెట్ మంత్రుల ప్రకటన సమయంలో ఆ వర్గాలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వాలన్నదానిపై సజ్జల స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగా కమ్మ వర్గానికి రాష్ట్ర స్థాయి పదవిని కేబినెట్ హోదాలో మాజీ మంత్రి కొడాలి నానికి ఇవ్వాలని నిర్ణయించారు
ఆ పదవి ఏంటంటే.. ఏపి స్టేట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా కొడాలి నానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎం ఆఫర్ ఇస్తే.. కొడాలి నాని కదనకుండా స్వీకరిస్తారని అంతా ఆశిస్తారు.. కానీ అందరికీ షాక్ ఇస్తూ.. సీఎం జగన్ ఇచ్చిన ఆఫర్ ను కొడాలి నాని తిరస్కరించారు. తాము పదవుల కోసం వెంపర్లాడే వాళ్లం కాదని..జగన్ గ్యారేజీలో సీఎం కోసం సని చేస్తామని.. ఆయన సైనికుడిగానే కొనసాగుతానని చెప్పిన కొడాలి నాని ఎందుకు పదవిని తిరస్కరించారని అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
తనకు మంత్రి పదవి వెంట్రుకతో సమానమంటూ పలు సార్లు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు మంత్రి పదవి ఉన్నా.. లేకపోయినా.. ఒకేలా ఉంటానని.. మరింత స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పగలను అన్నారు. కానీ తనకు తాజాగా ఇచ్చిన పదవి విషయం పైన సీఎంతో చర్చిస్తాను అన్నారు. తనకు పదవులు అవసరం లేదని.. మంత్రి పదవి పోవటంతోనే.. ఈ పదవి తీసుకున్నారనే అభిప్రాయం ఏర్పడటం తనకు ఇష్టం లేదని కొడాలి నాని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనకు కేవలం గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగడమే ఇష్టమన్నారు. చంద్రబాబు లాగా సీఎం పదవుల కోసం... మంత్రి పదవుల కోసం తాను ఎటువంటి రాజకీయాలు చేయనని స్పష్టం చేసారు. జగన్ ది అరుదైన వ్యక్తిత్వమని ప్రశంసించారు. అయితే సీఎం జగన్ ప్రతిపాదించిన పదవిని కొడాలి నాని తిరస్కరిస్తే...దాని పైన రాజకీయంగా చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది. ఆ పదవిని కొడాలి తిరస్కరించడానికి.. క్రిష్ణా-గుంటూరు-ప్రకాశం జిల్లాల బాధ్యతలు కొడాలి నానికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.