హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: మంత్రి పదవి పోయిన తరువాత కొడాలి నానిని ఇలా చూసి.. ఫ్యాన్స్ షాక్.. కారణం అదేనా?

Kodali Nani: మంత్రి పదవి పోయిన తరువాత కొడాలి నానిని ఇలా చూసి.. ఫ్యాన్స్ షాక్.. కారణం అదేనా?

పశువుల కొట్టంలో మాజీ మంత్రి కొడాలి నాని

పశువుల కొట్టంలో మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani: మంత్రి పదవి తనకు ఒక లెక్కకాదన్నారు.. పదవి పోతే మరింత రెచ్చిపోతాను అన్నారు.. కానీ మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత.. ఆయనలో ఆ ఫైర్ కనిపించలేదు అంటున్నారు ఫ్యాన్స్.. ఇదే సమయంలో ఆయన పశువుల కొట్టంలో పడుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన అలా ఎందుకు ఉన్నారు..?

ఇంకా చదవండి ...

Kodali Nani: అధికార వైసీపీ (YCP)లో ఎందరు నేతలు ఉన్నా కొడాలి నాని (Kodali Nani)ది పత్యేక శైలి.. ప్రస్తుతం అధినేత, సీఎం జగన్ (CM Jagan) కు ఉన్న అత్యంత వీర విధేయులలో కొడాలి నాని ఒక్కరు. తాను జగన్ సైనికుడుని అనే పదే పదే చెబుతూ ఉంటారు. అందుకే తనకు మంత్రి పదవి ఒక లెక్క కాదని బహిరంగంగానే చెప్పారు. తొలి కేబినెట్ లో ఉన్న 11 మందిని తిరిగి కొనసాగించి.. ఇతరులను తప్పించినప్పుడు.. చాలా మంది అసమ్మతి గళం వినిపించారు. ఒక్కో రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొడాలి నాని లాంటి ముగ్గురు నలుగురు మాత్రం నోరు మెదపలేదు.. మతని తన మనుషులు అని గుర్తించారు కాబట్టే పదవుల నుంచి తప్పించారని కొత్త అర్థం చెప్పారు. ఇతర 11 మందితో పోల్చుకుంటే.. రెండోసారి కొనసాగించాల్సిన జాబితాలో కొడాలి నాని కచ్చితంగా ఉంటారని అంతా భావించారు. అందుకు కారణం ఏంటంటే.. ప్రతిపక్ష నేత సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కీలక నేత కొడాలి నాని ఒక్కరే.. అంటే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ధీటుగా ఎదుర్కోవాలి అన్నా..? ఆ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు కాస్త దూరం చేయాలన్నాన కొడాలికి మంత్రి పదవి కచ్చితంగా ఇవ్వాలి.. కానీ జగన్ అసలు ఆ సామాజిక వర్గానికే కేబినెట్ లో చోటు ఇవ్వలేదు. అయినా అధినేత నిర్ణయాన్ని సమర్ధించారు కొడాలి నాని..

మంత్రి పదవి పోయిన తరువాత ఆయన మరింత దూకుడుగా ఉంటారని అంతా భావించారు. మంత్రి అన్న ట్యాగ్ పోవడంతో ఇక చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడతారని అంతా ఊహించారు.. కానీ మంత్రి వర్గ విస్తరణ పూర్తై ఇన్ని రోజులు అవుతున్నా.. ఎక్కడా కొడాలిలో ఆ ఫైర్ కనిపించలేదు. చాలా సైలెట్ అయ్యారు. దీంతో కొడాలికి ఏమైందనే చర్చ వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన పశువుల కొట్టంలో పడుకున్ని ఉన్న ఓ ఫోటో కనిపించడంతో అది వైరల్ అవుతోంది.. కొడాలి ఏంటి ఇలా అని అంతా షాక్ అవుతున్నారు.

ఇదీ చదవండి : మంత్రి అయ్యి ఉండి స్వామి ఉంగరం తీస్తారా అంటూ ప్రశ్న..? భయంతో వణికిన అమ్మాయిలు

ఒక పశువుల కొట్టంలో మంచంపై పడుకున్న కొడాలి నాని ఫొటోను నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి వరకు మంత్రిగా నిత్యం బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఇలా ఖాళీగా పశువుల కొట్టంలో దర్శనమివ్వడంపై చర్చ మొదలైంది. ఇక పార్టీ కోసం 24 గంటలు శ్రమిస్తానని అన్న ఆయన ఇలా ఖాళీగా ఉన్నారంటే అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మంత్రి పదవి పోయిందని నిరాశలోనే ఇలా చేస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా..? ఆయన బయటకు చెప్పకపోయినా.. తనకు మంత్రి పదవి తిరిగి ఇవ్వలేదని ఒక వైపు.. అలాగే తన సామాజిక వర్గానికి ఒక్క సీటు ఇవ్వకపోడంతో.. తాను సమాధానం చెప్పుకోలేకపోతున్నా..? అని సన్నిహితుల దగ్గర వాయిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి : పథకాల పేరుతో ఓ ఇంటికి చేరువయ్యాడు.. ఆ పేరుతో దారుణానికి పాల్పడ్డ వాలంటీర్

మరోవైపు కొడాలిపై సీఎం జగన్ కు ఉన్న అభిమానంతో కేబినెట్ హోదా కలిగిన ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్ చేస్తానని జగన్ చెప్పారు. కానీ దాన్ని కొడాలి తిరస్కరించినట్టు టాక్.. అయితే మంత్రి పదవి పోయాక కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ క్రమంలో సడెన్ గా కొడాలి పశువుల కొట్టంలో కనిపించారు.

First published:

Tags: Andhra Pradesh, AP cabinet, AP News, Gudivada, Kodali Nani

ఉత్తమ కథలు