Kodali Nani on NTR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (YCP) గా మధ్య మాటల యుద్ధం హీటెక్కిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) చుట్టూ రాజకీయం ముసురుకుంది. ఓ సామాజిక వర్గ ఓట్ల కోసమో.. లేక టీడీపీని బలహీనపరచాలన వ్యూహమో కారణం ఏదైనా..? ఎన్టీఆర్ ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో వైసీపీ (YCP) ఉందని రాజకీయ విశ్లషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టింది. ఏకంగా ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో ఆయన విగ్రహానికి వైసీపీ రంగులేయడం.. రాజకీయంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ తీరు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని విగ్రహానికి శుద్ధి చేసి తిరిగి పసుపు రంగు వేశారు. రేపటి నుంచి కృష్ణాజిల్లా (Krishna District) అంగలూరులో టీడీపీ మినీ మహానాడు (TDP Mini Mahanadu) ప్రారంభం కానుంది. ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ భారీ ఎత్తున జనసమీకరణ కూడా చేస్తోంది. ఇదే క్రమంలో అన్న ఎన్టీఆర్ విగ్రహా దిమ్మెకు వైస్సార్ పార్టీ రంగులు వేయడం ద్వారా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని.
ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదని, ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ నేతలు, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘‘ఎన్టీఆర్ జాతి సంపద. ఆయన ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చు. ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా తన దగ్గర ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎవరైనా రావొచ్చు అంటూ సవాల్ విసిరారు. బొమ్మలూరులో తన సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తానే ఏర్పాటు చేశాను అన్నారు. తన శిలా ఫలకాన్ని తొలగించడంతోనే వివాదం మొదలైందని గుర్తు చేశారు. గుడివాడ నియోజకవర్గం మొత్తం ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి వైసీపీ రంగులు వేయిస్తా. ఎవరేం చేస్తారో చూస్తా అంటూ సవాల్ విసిరారు.
సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీని గెలిపించలేని చంద్రబాబు.. గుడివాడలో ఏం గెలిపిస్తారు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ ఆఫీస్ ఖాళీ చేయించి, తన మీద 60 కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశీస్సులతో ఐదవసారి కూడా తనద విజయం అన్నారు. తన ప్రత్యర్థి చంద్రబాబు అయితే బాగుంటుంది. ఒకసారి కాటా దెబ్బ ఏంటో చూపిస్తాను అన్నారు.
టీడీపీ నేతలు బహిరంగ సభ అంటూ నాలుగు జిల్లాల్లో జన సమీకరణ చేస్తూ, విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను తప్పించి, ఇప్పటివరకు ఎవరినీ ఒక్క మాట కూడా తాను అనలేదు అని వివరణ ఇచ్చారు. భువనేశ్వరిపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి లేకపోవడం వల్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదు. మంత్రులుగా ఉన్నవాళ్లు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సమాధానం చెబుతారన్నారు. ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే మాత్రం తాను చూస్తూ ఊరుకోను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gudivada, Kodali Nani, TDP, Ycp