Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINSTER CHINTAMANENI PRAHKAR FIRE ON CM JAGAN AND YCP ABOUT COCK FIGHT ISSUE NGS

Chintamaneni: ఇంత రాక్షస రాజకీయమా..? లేని వ్యక్తిని ఉన్నవాడిగా చూపించడం దారుణం.. చింతమనేని పైర్

కోడిపందాల ప్రచారంపై చింతమనేని ఫైరల్

కోడిపందాల ప్రచారంపై చింతమనేని ఫైరల్

Chintamaneni: హైదరాబాద్‌ శివారులో దెందులూరు పుంజులు కాలికి కత్తి కట్టాయా..? కోడిపుంజులు చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయా..? నిన్న అర్థరాత్రి నుంచి ఇదే అంశం ప్రచారం ఉంది. అయితే ప్రచారంపై ఘాటుగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
    Chintamaneni: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  మాత్రమే ప్రత్యేకంగా నిలిచే కోడి పందాలు ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) కు షిఫ్ట్ అయ్యాయా..? తాజాగా గ్రేటర్ సిటీ శివారులో దెందులూరు పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని కాసుల వర్షం కురిపిస్తున్నాయా.. నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ప్రచారం ఇదే.. సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో.. అది కూడా కేవలం గోదావరి జిల్లా (Godavarai District) లకే పరిమితం అనుకున్న కోడి పందాలను (Cock Fight) హైదరాబాద్‌ శివారు వరకు తీసుకొచ్చింది ఎవరు..? ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా చాలా రోజులుగా హైదరాబాద్‌ శివారులో కోడి పందాలు కాయిస్తున్నది ఎవరు..? ఊహించని విధంగా సీన్‌లోకి ఖాకీల ఎంట్రీతో.. పందె బరులు విడిచి.. నిర్వాహకులు బెదిరి పరుగులు తీశారు. పెదకంజర్ల గ్రామంలో చాలా రోజులగా గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైద‌రాబాద్ పోలీసులు నిఘా వేసి నిన్న దాడులు చేశారు. మొత్తం 70 మందితో కలిసి పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. కానీ పోలీసులు వచ్చారని తెలియడంతో.. 49 మంది అక్కడ నుంచి పరారయ్యారు. మిగిలిన 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన వారిలో వీఐపీలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) .. ఉన్నారని.. ఆయన కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఈ పందాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది.

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన కోడి పందాల్లో పాల్గొని, పోలీసు రైడ్ తర్వాత పారిపోయినట్లు వచ్చిన పుకార్లపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కోడిపందాలపై పోలీసులు దాడి చేసిన తర్వాత తాను పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన ఫేస్ బుక్ ద్వారా ఫైర్ అయ్యారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా అంటూ ప్రశ్నించారు. 

    కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా అని ప్రశ్నించారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా అంటూ నిలదీశారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొండి, ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి అంటూ ఆయన ఫేస్ బుక్ లైవ్ లో కోరారు. ఈ నీచమైన ప్రచారం తోనే కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు, తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయిందైన్నారు.



    మీ అసత్యాలు మీ సొంతడబ్బాలాంటి పేపర్లును.. మీ కార్యకర్తలే కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయిందన్నారు. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ రాక్షస రాజకీయ వికట ఆట్టహాసానికి ముగింపు త్వరలోనే ఉందన్నారు చింతమనేని.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chintamaneni prabhakar, Cock fight

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు