హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Target Kodali Nani: టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నాని.. ఆమె అక్కడి నుంచే బరిలో దిగుతారా..?

Target Kodali Nani: టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నాని.. ఆమె అక్కడి నుంచే బరిలో దిగుతారా..?

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

Target Kodali Nani: గుడివాడ అంటే కొడాలి నాని అడ్డ.. ఈ సారి నానికి గట్టి పోటీ తప్పదా..? అనూహ్యంగా ఎన్టీఆర్ వారుసురాలు అక్కడ పోటీ చేయాలి అనుకుంటున్నారా..? ఆమెకు ఆమెగానే ఆ నిర్ణయం తీసుకున్నారా..? లేక చంద్రబాబే ఆమెను ఒప్పించారు..

Target Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గుడివాడ (Gudivada) నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు ప్రధాన కారణం అది మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster Kodali Nani) అడ్డా కావడమే.. వరుసగా ఆయన అక్కడ నుంచి గెలుపొందుతున్నారు. గత రెండు ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నానిని ఓడించడం సాధ్యం కాలేదు. కానీ తెలుగు దేశం కచ్చితంగా టార్గెట్ చేస్తున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి అన్నది బహిరంగ రహస్యమే.. కానీ ప్రస్తుత స్థానిక పరిస్థితులు, టీడీపీ (TDP) బలాన్ని లెక్క వేసుకున్నా.. గుడివాడలో ఎవరిని నిలబెట్టినా గెలుపు అంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు వ్యూహ మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పై ఇంకా క్లారిటీ లేదు.. ఒటకి తెలుగు దేశం పార్టీ, జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి పోటీ చేయడం.. లేద బీజేపీని దూరం పెట్టి, జనసేన-టీడీపీ కలిసి బరిలో దిగడం.. అదీ కుదరదంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిగా జగన్ ను ఢీ కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మూడు పార్టీలు కలిసి బరిలో దిగడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. కొడాలి నానిని ఢీ ఓడించాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి.. అది కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే.. కచ్చితంగా నానిపై ఒత్తిడి ఉంటుంది.. అందుకే ఈ సారి చంద్రబాబు వ్యూహం మార్చారని తెలుస్తోంది.

బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా.. తన భార్య సోదరి భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌హిళా నేత, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి గుడివాడ నుంచి పోటీచేయాలని కోరినట్టు తెలుస్తోంది. పొత్తులు ఉన్నా లేకున్నా.. గెలుపునకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పురందేశ్వరి ఏ పార్టీ తరపున బరిలో దిగినా..టీడీపీ, జనసేన మద్దతు ఉంటే గెలవడం పెద్ద కష్టం కాదు.. అందుకే ఆమె ఈ సారి గుడివాడ నుంచి పోటీ చేయడమే బెటరని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తారక‌రామారావు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇటు ఏపీ బీజేపీ నేతలు సైతం కొడాలి తీరుపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఇటీవల కొడాలి నాని బీజేపీ నేతలను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పురందేశ్వరిని నిలబెడితే.. కొడాలికి చెక్ పెట్టినట్టు అవుతుందని.. పొత్తులతో సంబంధం లేకుండా టీడీపీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు సైతం లెక్కలు వేసుకుంటున్నారు.

ఇదీ చదవండి : నాటు రుచులు నీటుగా.. వచ్చి తిని పో.. చింగ్‌ చాంగ్‌.. వీటి గురించి తెలిస్తే నోరూరాల్సిందే?

ఒకవేళ పురంధేశ్వ‌రి పోటీచేస్తే ఉమ్మ‌డి కృష్ణా జిల్లాపై కచ్చితంగా ఆ ప్ర‌భావం ఉంటుంది. ఈ విష‌యం గురించి ముందుగానే ఉప్పందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న రాజ‌కీయ వ్యూహంలో భాగంగానే కొడాలి నానిద్వారా విమ‌ర్శ‌ల దాడి చేయించింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా గుడివాడ నుంచి పోటీచేస్తే ఆ ప్ర‌భావం ఉమ్మ‌డి కృష్ణా జిల్లాపై చూపిస్తుంద‌ని వైసీపీ ఆందోళ చెందుతోంది. ఆ ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు, పురంధేశ్వ‌రిని వెన‌క‌డుగు వేయించేందుకే ఇలాంటి వ్యూహాల‌ను ఆ పార్టీ అవ‌లంబిస్తోంద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Gudivada, Kodali Nani, Purandeswari

ఉత్తమ కథలు