Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINSTER ANIL KUMAR YADAV WILL CHANGE HIS PLACE NEXT ELECTIONS HE WILL CONTEST VENKATAGIRI NGS

Ex Minster: రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.. మాజీ మంత్రి కూడా.. అయినా ప్లేస్ మారక తప్పదా..?

మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

Exminster: అధికార వైసీపీలో ఆయన ఓ కీలక నేత.. రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.. మంత్రిగా కూడా పని చేశారు.. అన్నిటికి మించి.. జగన్ కు వీర విధేయుడు.. కానీ అలాంటి నేత వచ్చే ఎన్నికల్లో.. సీటు మారక తప్పదా..? అధిష్టానం ఇప్పటికే ఆ విషయం చెప్పిందా.? మరి ఆయన ఒకే అంటారా..?

ఇంకా చదవండి ...
  Exminster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP)లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.. వీర విధేయులు ఎవరు అంటే వేళ్లపైనే లెక్కపెట్టొచ్చు.. అలాంటి వారిలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ (Anil kumar Yadav). నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నెల్లూరు సిటీ (Nellore City) నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక 2019 లో రెండోసారి గెలిచాక కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఆయనకు మొదటి నుంచి ఫైర్ బ్రాండ్ గా ఉంది. అదే దూకుడు కొనసాగిస్తూ వచ్చారు. మంత్రి అయిన తరువాత మరింత దూకుడు పెంచారు.. కానీ మంత్రి పదవి పోయాక ఆ దూకుడు తగ్గించారు. తాజాగా ఇటీవల మళ్లీ ప్లీనరిలో ప్రత్యర్థిలపై మాటల తూటాలు పేల్చారు. అయితే విమర్శలు చేయడంలో ఆయన దూకుడు ఉన్నా..? మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు.. ఎమ్మెల్యేగా ఉండే అనిల్ కు చాలా తేడా ఉందనేది నియోజకవర్గంలోని వైసీపీ నేతలు చెప్పేమాట.

  మంత్రిగా ఉన్న మూడేళ్లూ నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్లను విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం జగన్‌ (CM Jagan) మీద అభిమానంతో ఎన్నికల్లో అనిల్‌కు మద్దతిచ్చిన బలమైన సామాజికవర్గానికి చెందిన కొందరు.. కొంతకాలంగా ఆయనతో అంటీముట్టనట్టు ఉంటున్నారని ప్రచారం ఉంది. సీఎం జగన్ తొలి కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆయన.. తన వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని వైసీపీ శ శ్రేణుల గుసగుసలు వినిపించేవి.  ముఖ్యంగా అనిల్‌ కుమార్ సమీప బంధువొకరు అన్ని వ్యవహారాల్లో తలదూర్చి భారీగా వెనకేసుకున్నట్టు వైసీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. దాదాపు 13 కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని వాళ్లు ఉదాహరణగా చూపిస్తున్నారట. చెన్నై, బెంగళూరుల్లో ఖరీదైన ఆస్తులు పోగేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారట. ఈ కారణంగానే మొదటి నుంచి అనిల్‌ కోసం పనిచేసిన పలువురు క్రమంగా దూరం జరుగుతున్నారట. ఇక మంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత ఆయన తీరులో మార్పు రాలేదు అంటున్నారు. అనిల్‌కు మొదటి నుంచి అనుచరుడిగా ఉన్న నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌.. ప్రస్తుతం మాజీ మంత్రి కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కాకాణి గోవర్దన్‌రెడ్డి మంత్రి అయ్యాక అనిల్ అనుచరుల్లో చాలా మంది ప్లేట్ ఫిరాయించేశారు. పైగా నెల్లూరు సిటీలోని ప్రజల్లో అనిల్‌కు బలం తగ్గిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. అందుకే అనిల్ ను వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ఆ విషయాన్ని ఇప్పటికే అనిల్ కు అధిష్టానం పెద్దలు చెప్పారని సమాచారం.

  ఇదీ చదవండి : ఎన్డీఏ వైపు చంద్రబాబు తొలి అడుగు.. వ్యూహా మార్చిన టీడీపీ అధినేత.. వర్కౌట్ అవుతుందా?

  వెంకటగిరిలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారనేదానిపై సందిగ్ధత నెలకున్నట్టు తెలుస్తోంది. ఆనం కుమార్తె కైవల్య ఇటీవల టీడీపీ నేత లోకేష్‌తో సమావేశమై.. ఆత్మకూరు టికెట్ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆనం టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా ఉంది. అందుకే వెంకటగిరిలో అనిల్‌ను బరిలో దింపే యోచన చేస్తున్నారట. అనిల్ బీసీ సామాజివర్గం కావడం.. వెంకటగిరిలో ఆ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం రాజకీయంగా కలిసి వస్తుందని లెక్క లేస్తున్నారట. పార్టీ సమావేశాల్లో తాను నెల్లూరు నుంచే పోటీ చేస్తానని అనిల్‌ చెబుతున్నా.. అనుచరులకు మాత్రం వెంకటగిరిలో పోటీపై సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి దీనికి అనిల్ ఒప్పుకుంటారా.. ఆనంను కాదని అక్కడ ఇతరులకు టికెట్ ఇస్తే.. గెలిపిస్తారా? వ్యతిరేకంగా పని చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు