Anilkumar Yadav: నెల్లూరు రాజకీయాల్లో (Nellore Politics) హీట్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. జిల్లా పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన అధిష్టానం.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) , ప్రస్తుతం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) పై సీరియస్ అయ్యింది. పద్ధితి మార్చుకోమని హెచ్చరించింది. అయినా ఇద్దరి తీరు మారలేదు. దీంతో ఆ పంచాయితీ నేరుగా సీఎం జగన్ దగ్గరకు చేరింది. ఇద్దరూ వేర్వేరుగా సీఎం జగన్ (CM Jagan) తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరికీ కీలక సూచనలు చేసినట్టు సమాచారం.. నేతలు పంతానికి పోయి.. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పార్టీకి నష్టం వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. నిజంగా ఇద్దరి మధ్య ఏవైనా విబేధాలు లేదా సమస్యలు ఉంటే తనకు చెబితే సమస్య పరిష్కరిస్తాను అన్నారు. సీనియర్ నేతలు అయ్యి ఉండి.. ఇలా ఎవరికి వారు అన్నట్టు వ్యవహరిస్తే ఎలా అని.. పార్టీ కోసం అంతా కలిసి పని చేయాలని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అయితే సీఎంను కలిసిన తరువాత ఇద్దరు విరుద్ధ స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
సీఎంను కలిసి వచ్చిన తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జగన్ తనకు కొండంత అండ అన్నారు. అందుకే తాను ఒంటరిని కాదన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు అందర్నీ కాకిణి కలుస్తున్నారనే వార్తలకు ఆయన కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. అలాగే సీఎం అండ ఉన్నంత వరకు తాను ఎందుకు ఒంటరి అవుతాను అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు రెండు జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ణతలు తెలిపేందుకు మాత్రమే ఇక్కడి వచ్చాను అన్నారు. పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారని.. తామంతా సీఎం మనుషులుగానే పని చేస్తామన్నారు. సీఎం గీత గీస్తే ఎవరూ దాటే పరిస్థితి లేదన్నారు.
ఇదీ చదవండి : పోరాడే శక్తి ఇవ్వాలని దుర్గమ్మకు చంద్రబాబు పూజలు.. స్వయంగా కలిసి విష్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే
నెల్లూరులో కోల్డ్ వార్ అంటూ ఏమీ లేదన్నారు. అయితే కుటుంబంలో ఎక్కడైనా చిన్నచిన్న విభేధాలు ఉంటాయి. అందరూ కలసి కట్టుగా పని చేస్తామన్నారు. వైసీపీలో వర్గాలనేవి ఏవీ అసలు ఉండవని.. అంతా జగన్ వర్గమే అన్నారు. తన నియోజక వర్గంలో ఫ్లెక్సీలు వేయడమనేది రెండున్నరేళ్లుగా ఎక్కడా లేదని.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీలు ఎవరు వేసినా తీసేశామని గుర్తు చేశారు. నెల్లూరు సిటీలో ఎవరు ఫ్లెక్సీ కట్టినా తీసేస్తారన్నారు.
ఇదీ చదవండి : అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. అప్పుడే యాక్షన్ లోకి దిగిన విడదల రజనీ
తాము ఫ్లెక్సీలు ఎక్కడా తీయలేదని.. మున్సిపాల్టీవారే తీసేశారని వివరణ ఇచ్చారు. ఆ రోజు గాలికి వేమిరెడ్డి హోర్డింగ్ లు కొన్ని చిరిగి పోయాయని.. హోర్డింగ్సులో 7లో 1 మాత్రమే గాలికి చిరిగిందన్నారు. వేమిరెడ్డి పై ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా గాలికి చిరిగాయని గుర్తు చేశారు. పార్టీ అనే కాదు.. తనకు ఎవరైనా కొంత సాయం చేస్తే అంతకన్నా ఎక్కువగా తాను సాయం చేస్తాను అన్నారు. 2024 లో సీఎం జగన్ని మళ్లీ సీఎం ను చేయడమే తమ లక్ష్యం అన్నారు. తాను కేవలం రెండు జిల్లాలకే పరిమతం కాకుండా.. రాష్టమంతా తిరుగుతాను అన్నారు.
ఇదీ చదవండి : టీడీపీలోకి భారీగా వలసలు..! పక్కా సమాచారంతోనే ఆ మాజీ మంత్రి కామెంట్ చేశారా..?
అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. తీసేసిన 14 మంది తిరిగి మంత్రులు అవుతామని.. కాకాని, తాను.. ఇద్దరం విడివిడిగా సీఎంను కలిశామన్నారు. ఆనంపై తాను సీఎంకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సీఎంకు చాడీలు చెప్పే అలవాటు తనకు లేదన్నారు. అయితే సీఎంతో భేటీ తరువాత కాకాణి మాట్లాడుతూ.. అనిల్ కు తనకు మధ్య ఎక్కడా విభేదాలు లేవన్నారు. పోటా పోటీ సభలనేవి మీడియా సృష్టే అని కొట్టిపారేశారు. సాధారణంగా నిప్పులేనిదే పొగరాదు అంటారు కానీ.. ప్రస్తుతం నిప్పు లేకుండానే పొగ వస్తోంది అన్నారు. నీడనిచ్చే చెట్టు నీడను నరుక్కునే మూర్ఖులం తాము కాదన్నారు. నెల్లూరులో ఎవరి ఫ్లెక్సీలు ఎవరూ చింపలేదని.. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని మాత్రంమే సీఎం సూచించారన్నారు కాకాణి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm ys jagan mohan reddy, AP Politics, Nellore Dist