AP POLITICS EX MINSTER ANIL KUMAR YADAV HOT COMMENTS ON AP NEW CABINET NGS
Ex Minster Anil: ప్రమాణ స్వీకారానికి అందుకే వెళ్లలేదు.. రిటన్ గిఫ్ట్ ఇస్తా.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)
EX Minster Anil: తొలి కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్ని అనిల్ యాదవ్ కు సెకెండ్ ఛాన్స్ దక్కలేదు.. మాజీ మంత్రులు అంతా కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాలని అధిష్టానం చెప్పినా.. ఆయన డుమ్మకొట్టారు. దీనిపై వివరణ ఇచ్చిన అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయనకు రిటన్ గిఫ్ట్ ఉంటుంది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడారు.
EX Minster Anil: తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) కు సీఎం జగన్ (CM Jagan) వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. అయితే తొలి కేబినెట్ (Cabinet) నుంచి పది పైగా మందిని కొనసాగిస్తున్నారూ అనే వార్త రాగానే అనిల్ పేరు కూడా అందులో ఉంటుందని.. రెండో ఛాన్స్ దక్కించుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయనకు మంత్రి మండలిలో చోటు దక్కలేదు. మాజీగానే మిగిలిపోయారు. తాజాగా మాజీలు అయిన అందరినీ.. కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని అధిష్టానం ఆహ్వానించింది. జగన్ కు అత్యంత సన్నిహితుడు.. ఆయన మాట జవదాటని అనిల్ సైతం ప్రమాణ స్వీకారానికి హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనిల్ ఎందుకు ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదు.. మంత్రి పదవి రాలేదని అలకబూనారా.. తన ప్రత్యర్థి వర్గానికి మంత్రి పదవి వచ్చిందని హర్ట్ అయ్యారా.. ఆయన రాకపోవడానికి కారణం ఏంటి అంటూ విపరీతంగా చర్చ జరిగింది. అయితే తాను ఎందుకు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు అనిల్ యాదవ్..
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదు అన్నారు. అందుకే ప్రమాణ స్వీకారానికి రాలేకపోయాను అని వినించారు. తాను మంత్రిగా ఉన్పప్పుడు ఎంత సహకారం అందించారో.. దానికి డబుల్ సహకారం అందిస్తాను అంటూ సెటైర్ వేస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం మాత్రమే ఉండేది. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య విబేధాలు వాస్తవమే అని తెలింది. మరోవైపు కచ్చితంగా మరోసారి కేబినెట్ మంత్రి అవుతానని.. తమకు సీఎం జగన్ హామీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు అనిల్.
మొన్నటి వరకు మంత్రిగా ఉండడంతో కాస్త విమర్శల వానను తగ్గించిన అనిల్ యాదవ్.. మంత్రి పదవి పోయిన వెంటనే తన మాటల దాడిని పెంచారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను భీమ్లా నాయక్ కాదని.. బిచ్చం నాయక్‌గా అభివర్ణించారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కల్యాణ్ ఆరాటం చూస్తే ఆయన పరిస్తితి ఏంటో అర్థమవుతోంది అన్నారు. నిజంగా పవన్ కు దమ్ము ధైర్యం ఉంటే.. సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని వారు ఇచ్చే 30-40 సీట్ల కోసం వెంపర్లాడే పవన్ కల్యాణ్.. భీమ్లా నాయక్ కాదని.. బిచ్చం నాయక్ అని మండిపడ్డారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీదారు తెలుగుదేశమే తప్ప... సైడ్ క్యారెక్టర్ లాంటి పవన్ కాదన్నారు అనిల్. వైఎస్ జగన్ కు తాము ఎప్పటికీ సైనికులమేనని అనిల్ వ్యాఖ్యానించారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో సైనికుల్లా తమను దింపారని చెప్పారు. మంత్రి పదవులను తొలగించిన తరువాత తాను గానీ, పేర్ని నాని గానీ, కొడాలి నాని గానీ.. ఇంకా స్వేచ్ఛగా తమ గళాన్ని వినిపించగలమని తేల్చి చెప్పారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.