AP POLITICS EX MINSTER ANIL KUMAR YADAV GAVE CLARITY ON HIS OPEN MEETING THIS NOT AGAINST FOR NAY ONE NGS
AP Ex Minster: తగ్గేదేలే అంటున్న మాజీ మంత్రి.. పోరు అధిష్టానం పైనా..? పార్టీకి నష్టం తప్పదా..?
మాజీ మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)
AP Ex Minster: మొన్నటి వరకు అంటే కేబినెట్ లో ఉన్నంత వరకు.. ఎస్ బాస్ అన్నారు.. సీఎం జగన్ కు తాను వీర విధేయుడిని అన్నారు.. ఇప్పుడు మాజీ అయ్యారు.. దీంతో రూటు మార్చారా..? అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా..? లేక మంత్రిపై కోపంతోనే బల ప్రదర్శన చేస్తున్నారా..? ఇంతకీ ఆ మాజీ మంత్రి ఏమంటున్నారంటే..?
AP Ex Minster Anil Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో అంతర్గత పోరు తీవ్రం అవుతోంది. కేబినెట్ విస్తరణకు ముందు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క అన్నట్టు నేతల తీరు ఉండడం అధిష్టానానికి షాక్ తగిలేలా ఉంది. మీ నిర్ణయమే శిరోధార్యం అంటూ మూకుమ్మడి రాజీనామాలు చేసిన మంత్రులు.. మాజీలు అయిన తరువాత కేబినెట్ విస్తరణ (Cabinet Reshuffle)పై గుర్రుగా ఉన్నారు. ఇద్దరు, ముగ్గుర్ని మాత్రమే తిరిగి కొనసాగిస్తామని చెప్పిన సీఎం జగన్ (CM Jagan).. 11 మందిని కొనసాగించడంతో.. మిగిలిన వారంతా గుర్రుగా ఉన్నారు. తాము ఎందులో తక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవి దక్కలేదని కొందరు.. తమ ప్రత్యర్థి వర్గానికి పదవులు ఇచ్చారని మరికొందరు.. గుర్రుగా ఉన్నారు. కొందరు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేసినా.. ఆ తరువాత సీఎంతో చర్చించిన తరువాత.. చల్లబడ్డారు. ఆవేదన ఏం లేదంటూ అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా (Nellore District) వైఎస్సార్సీపీ (YSRCP) రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రివర్గ విస్తరణతో ఆ పార్టీలో అంతర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా కొత్తగా మంత్రి ఎన్నికైన కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)తో అనిల్ కుమార్ యాదవ్ కు (Anil Kumar Yadav) కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల మీడియా సమావేశంలో తనకు గోవర్ధన్ అన్న ఎలా సహకరించారో.. అంతకు డబుల్ సహకరిస్తానని అనిల్ కుమార్ చెప్పడంతో పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
అనిల్ కుమార్ ఎక్కడా తన ఆవేదన బయట పెట్టడం లేదు.. కానీ ఏదో ఒక రూపంలో తన బలం ఏంటో అధిష్టానానికి లేదా ఆ మంత్రికి తెలియచేయాలని ఆరాటపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు ప్రజలను కలిసేందుకు మాజీ మంత్రి గడప గడపకు అనిల్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు నెల్లూరులో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అనుమతులు కూడా తీసుకున్నారు. సభను విజయవంతం చేయాలని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంత వరకు ఏం సమస్య లేదు. కానీ అదే రోజు. 5:30 గంటలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీకి వస్తున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల కార్యక్రమాలు జరగబోతుండడంతో ఉత్కంఠ పెరుగుతోంది.
మాజీ మంత్రి అనిల్ కేవలం ఈ సభను బల ప్రదర్శనకు వేదికగానే నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా మంత్రి కాకానికి మద్దతు ఇచ్చిన వారికి.. తన బలం తెలియచేయడమే లక్ష్యంగా ఈ సభ ఏర్పాటు చేశారని వైసీపీ వర్గాల టాక్.. మరి దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.. ఆయన అయితే ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు.. మరి తన వెల్ కమ్ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి నెల్లూరు నేతలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు. ఆయన ఎలాంటి స్టెప్పు తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు రేపు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్కు మాజీ మంత్రి అనిల్ కుమార్తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్న్టుటన్నాయి అన్న విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది.
తాను నిర్వహించేది బల ప్రదర్శన సభ కాదు అంటున్నారు అనిల్ కుమార్.. అలాగని వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. అయితే ఈ సభకు నియోజకవర్గం నుంచి మాత్రమే కార్యకర్తలు హాజరవుతారని.. ఇది ఎవరికీ పోటీ సభ కాదు అన్నారు.. 3 రోజుల ముందే సభకు అనుమతి కోరినట్టు వెల్లడించారు. ఇక, సీఎం జగన్కు సైనికుడుగానే ఉంటానని స్పష్టం చేశారు.. సభ వాయిదా వేసుకోవాలని అధిష్టానం కూడా సూచించలేదన్నారు.. ఎవరో కార్యక్రమం పెట్టారని నేను సభ పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.