Ex Minster Anil Kumar Yadav: నెల్లూరు (Nellore) వైసీపీ (YCP) రాజకీయాల్లో హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు.. బల ప్రదర్శన కాదన్నారు.. కానీ అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) సభ చూసినా.. ఆయన మాటలు విన్నా.. వైసీపీలో వర్గ పోరు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. తనకు ఎవరూ పోటీ కాదని.. తనకు తానే పోటీ అన్నారు అనిల్.. అంతే కాదు తన సభలో ఎక్కడా ప్రస్తుత మంత్రి ఫోటో కనిపించలేదు. కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు. అటు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (kakani Govardhan Reddy) సైతం.. సీనియర్లు.. జూనియర్లను కలుపుకు వెళ్తాను అంటూ వివాదం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరిలో ఎవరూ వెనక్కు తగ్గలేదు. ఒకే సమయంలో మంత్రి అనిల్ భారీ భహిరంగ సభతో తన సత్తా చూపిస్తే.. మంత్రి భారీ ర్యాలీ ఇది తన స్టామినా అని అందరికీ తెలిసేలా చేశారు.
సభ మొత్తం ఆయన భారీగా పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను ఏం చేయబోతున్నదీ తేల్చి చెప్పారు. మంత్రులుగా పదవులు తీసేసిన తనతో పాటుగా కొడాలి నాని- పేర్నినాని - కన్నబాబులది ఒకటే లక్ష్యం అన్నారు. తామంతా తామంతా మంత్రులుగా ఉండడం కంటే..? జగన్ సైనికుడిగా ఉండడానికే ఇష్టపడతాం అన్నారు. అలాగే విపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు ఛాలెంజ్ విసిరారు. ఇద్దరికీ దమ్ముంటే జగన్ పైన ఒంటరిగా పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. ముఖ్యంగా మరోసారి పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఇదీ చదవండి : హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనపై నిరసనలు.. 20 మంది అరెస్ట్.. చర్యలు ఏవని బీజేపీ ప్రశ్న
నిజంగా పవన్ కు దమ్ము ఉంటే.. ఒంటరిగా 140 సీట్లలో పోటీ చేసి తానే సీఎం అభ్యర్ధినని చెప్పగలా అని ప్రశ్నించారు. నిజంగా అలా చేస్తే ఆయనను భీమ్లా నాయక్ అంటామని.. లేదంటే ఆయన బిచ్చా నాయక్ అన్నారు. చంద్రబాబు వేసే ముష్టి కోసం.. ఆ 30-40 సీట్ల కోసం పవన్ ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. వాళ్లందరూ కలిసి కట్టుగా వచ్చినా.. విడివిడిగా వచ్చినా 2024లో జగన్ మరోసారి సీఎం అని ధీమా వ్యక్తం చేసారు. ఈ జన్మకు జగన్ కు రుణ పడి ఉంటాను అన్నారు. రాజు యుద్దానికి వెళ్లే ముందు తాను నమ్మిన సైన్యాన్ని ముందు పంపిస్తారని.. అలాగే ఇప్పుడు తామందరినీ ఎన్నికల యుద్ధంలోకి దింపారని అనిల్ అభిప్రాయపడ్డారు. తన వయసు ఇంకా 42 ఏళ్లేనని.. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేగా - మంత్రిగా జగన్ వద్ద పని చేస్తానన్నారు. మళ్లీ మంత్రి పదవి రాదని భయపడడానికి తన వయసు 60 ఏళ్లు కాదన్నారు.
ఇదీ చదవండి : కోర్టు చోరీ కేసులో నిందుతుల అరెస్ట్.. నిజమే చెప్పారా..? పోలీసుల వెర్షన్ ఏంటి..?
మంత్రిగా ఉన్నంత కాలం.. మూడేళ్ల నుంచి కార్యకర్తలతో సరిగ్గా కలిసే అవకాశం రాలేదన్నారు.. రేపటి నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాను అన్నారు. మే 1వ తేదీ నుంచి ప్రతీ గడపకు వెళ్తానన్నారు. నెల్లూరులో టీడీపీ కంచుకోటల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసామని చెప్పుకొచ్చారు. ఈ సభ తాను వైసీపీ కార్యకర్తలతో పెట్టుకున్న సభ అంటూ..ఆదివారం ట్రాఫిక్ ఉండదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసానని అన్నారు. తాను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీ అంటూ పంచ్ డైలాగ్ లు పేల్చారు.
ఇదీ చదవండి : ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్.. కేంద్రం నుంచి ప్రశంసలు
వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జగన్ బొమ్మ పెట్టుకునే గెలిచామన్నారు. వ్యక్తిగతంగా అయితే తనకు మూడు - నాలుగు వేల ఓట్లు మాత్రమే వస్తాయని.. ఎవరైనా కానీ జగన్ బొమ్మ పెట్టుకుంటేనే ఎమ్మెల్యే అయ్యేదని చెప్పుకొచ్చారు. తాను సభ ఏర్పాటు చేస్తే..ఉత్కంఠ అని.. ఏం మాట్లాడుతారో అని.. ఏదేదో ప్రచారం చేసారని.. కానీ, తాను మాత్రం జగన్ సైనికుడినని.. తన రక్తంలోనూ జగన్నామస్మరణ మాత్రమే ఉంటుందంటూ అనిల్ స్పష్టం చేశారు. ఎక్కడా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ప్రస్తావించని అనిల్...మంత్రి పదవి పోవటంతో తాము రెండింతల శక్తి వంతులమన్నారు. మంత్రి ఇటు మంత్రి కాకిణి కూడా అనిల్ సభపై స్పందించారు. ఆయన కేవలం కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారని.. దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదున్నారు. తాను మంత్రిగా జిల్లాలో ఉన్న సీనియర్లు, జూనియర్లను కలుపుకొని వెళ్తాను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm jagan, AP News, Nellore, Ycp