Anil Kumar Yadav:మంత్రిగా ఉన్నప్పుడు ఓ లెక్క.. మాజీ అయ్యాక మరో లెక్క అన్నట్టు ఉంది వైసీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)స్లైల్.. ఆయన మాట్లాడితే కాంట్రవర్సీ... మాట్లాడకున్నా కాంట్రవర్సీనే... నెల్లూరు (Nellore) రాజకీయాలే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయన ఫైర్ బ్రాండ్.. ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి మౌత్ పీస్ గా వ్యవహరించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh), పవన్ (Pawan) లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు.. సీఎం జగన్ (CM Jagan) కు సైనికుడిలా ఆయనను ఒక మాట అంటే.. వంద మాటలతో విరుచుకుపడేవారు.. దీంతో ఆయనకు రౌడీ రాజకీయ నేత అనే ముద్ర కూడా వేశారు. అలాంటి అనిల్ కుమార్ ప్రస్తుతం పూర్తిగా రూటు మార్చారు.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తూ హల్ చల్ చేశారు. గతంలోలా విపక్షాల పై మాటల్లో ఆ ఫైర్ కనిపించడం లేదు. మొన్నటి వరకు దూకుడుతో రెచ్చిపోయే అనిల్ ఒక్కసారిగా లైన్ చేంజ్ చేశారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా నెల్లూరులో గత కొంతకాలంగా ఫ్లెక్సీలను నిషేధించారు. మంత్రి అనిల్ సైతం తన ఫ్లెక్సీలు పెట్టుకోవడం లేదని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం రచ్చ రచ్చ అయ్యింది. దీంతో ఫ్లెక్సీల చించివేత, తొలగింపు వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగా తొలగించడం కానీ... చించివేయడం కానీ చేయలేదన్నారు. గత రెండున్నరేళ్లుగా నగరంలో ఫ్లెక్సీలను వేయొద్దన్న నిర్ణయంతో... చివరకు తన ఫ్లెక్సీలను కూడా వేయలేదన్నా రు. ఫ్లెక్సీల తొలగింపు వివాదం దురదృష్టకరమన్నారు.
ఇదీ చదవండి : వైసీపీకి ఊహించని షాక్.. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఉక్కు దెబ్బ బాగానే పడిందా..?
నెల్లూరు సిటీలో ఇకపై ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు అన్నారు.రెండున్నరేళ్లుగా ఫ్లెక్సీ రహిత నగరంగా నెల్లూరు సిటీ ని ఉంచగలిగామన్నారు. ఫ్లెక్సీలు కట్టొద్దు అంటే కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు అని ప్రశ్నించారు. ఇకనుంచి ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు. అలాగే తనకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాలేదన్నారు. ప్రమాణ పూర్తిగా ఇది తన నిర్ణయమే అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కాగితంపై సంతకం చేసిన వారికే మా మద్దతు.. కాంగ్రెస్ తో పొత్తుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అనిల్ గుండాయిజం చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు… తాను గనుక గుండాయిజం చేస్తే ఫ్లెక్సీలు కట్టిన వారి చేతులు ఉండేవా? అంటూ ప్రశ్నించారు. అలాంటివి తాను చేయనున్నారు. మంచి పని చేయాలని తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు వివాదమవుతోందన్నారు. ఇకపై ఎవరైనా నచ్చినచోటల్లా ఫ్లెక్సీలు వేసుకోండంటూ అసహనం వ్యక్తం చేశారు అనిల్. తన ఫ్లెక్సీలు మాత్రం ఎవరూ పెట్టొద్దని కార్యకర్తలకు స్పష్టం చేశారు. మెత్తగా, సునితంగా, మౌనంగా ఉంటానే తప్పించి ఎవరికీ హానీ చేయనన్నారు అనిల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Nellore Dist, Ycp