Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINSTER ANIL KUMAR AND MINSTER VIDADLA RAJANI COMMENTS VIRAL NGS GNT

YSRCP Plenary 2022: ఏ బిడ్డా.. ఇది జగనన్న అడ్డా..! ప్లీనరీలో విడుదల రజని, అనిల్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్

YSRCP Plenary 2022: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో.. కొందరి నేతల వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. తొలిరోజు ప్లీనరీలో చాలామంది మాట్లాడినా.. మంత్రి విడుదల రజనీ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు మాత్రం సభ దద్దరిల్లేలా చేశారు.. వారు ఏమన్నారంటే..?

YSRCP Plenary 2022: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో.. కొందరి నేతల వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. తొలిరోజు ప్లీనరీలో చాలామంది మాట్లాడినా.. మంత్రి విడుదల రజనీ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు మాత్రం సభ దద్దరిల్లేలా చేశారు.. వారు ఏమన్నారంటే..?

YSRCP Plenary 2022: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో.. కొందరి నేతల వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. తొలిరోజు ప్లీనరీలో చాలామంది మాట్లాడినా.. మంత్రి విడుదల రజనీ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు మాత్రం సభ దద్దరిల్లేలా చేశారు.. వారు ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
    YSRCP Plenary 2022: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP) ఫుల్ జోష్ లో ఉంది. ప్లీనరీ తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ సభలో చాలామంది మంత్రులు.. నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అందులో.. ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలాచాయి.. మంత్రి విడుదల రజని (Minster Vidadala Rajani).. మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil kumar) చేసిన వ్యాఖ్యలతో సభ దద్దరిల్లింది. అనిల్ కుమార్ అయితే ఓ అడుగు ముందుకు వేసి.. పుష్పా సినిమా (Pushpa movie) డైలాగ్ లు పేల్చారు. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ, జగనన్న అడ్డా.. ఎవ్వరి ఆటలు సాగవు అని హెచ్చరించారు పుష్ప లెవెల్ లో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌  పంచ్ డైలాగ్ పేల్చారు. గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడి ఆటలు ఇక సాగనివ్వం అని హెచ్చరించారు అనిల్. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా.. తాము సంస్కారంతో ఓపిగ్గా వున్నాం.. కానీ, లోకేష్ కామెడీ చేస్తున్నారని మండిపడ్డారు. 

    అక్కడితోనే అనిల్ కుమార్ ఆగలేదు. ఒకవేళ జగనన్న ఒక్క సైగ చేస్తే.. వారిని రాష్ట్రం నుంచి తరిమేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చేప తోలు వలచినట్టు వలిచేస్తామని ఘాటుగా హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు సాధించింది వైసీపీ విక్టరీ కొట్టింది.. ఇక, 2024లో 175 స్థానాలు కొడతాం.. రానున్న ఎన్నికల్లో టీడీపీకి పాడి కడతాం అంటూ వ్యాఖ్యానించారు.

    ఇదీ చదవండి : ప్రధాని ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించారా? ఆయన నో అంటే రాజమౌళి ఫ్యామిలీకి ఛాన్స్ దక్కిందా?

    ఇక, సీఎం కుర్చీని ఎవరూ టచ్‌ చేయలేరని వ్యాఖ్యానించారు అనిల్‌ కుమార్.. తమ బాస్‌ సీఎం అయ్యాక.. ఆ కుర్చీని తీసుకునే దమ్ము ఇక ఎవరికీ లేదన్నారు. అలాగే ఓ వ్యక్తి కష్టం, ఆశయంలో నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందన్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పేద విద్యార్ధులను సొంత అన్నలా చదివిస్తున్నారని ఆయన ప్రశసించారు. తెలుగు గడ్డపై గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. కాల గర్భంలో కలిసిపోయాయని అన్నారు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (chevireddy bhaskar reddy).

    ఇదీ చదవండి : : ఇడుపుల‌పాయ‌లో సేమ్ సీన్.. పక్క పక్కనే ఉన్నా ప‌ల‌క‌రించుకోని జ‌గ‌న్‌, ష‌ర్మిల‌

    ఇక మంత్రి విడదల రజనీ (vidadala rajini) అయితే జై జగన్ అంటూ గొంతు పగిలేలా నినాదాలు చేశారు. సీఎం జగన్ ఎంతోమంది లీడర్లను తయారు చేశారని అన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా జగనన్న పాలన వుందని రజనీ ప్రశంసించారు. వైసీపీ ప్రస్థానం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైందని ఆమె గుర్తుచేశారు. టీడీపీ పాలనలో కంటే ఎక్కువ మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నామని రజనీ అన్నారు. జగనన్న పాలన ప్రజాహితం, పేదల పక్షమని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని మంత్రి వెల్లడించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm jagan, AP News, Vidadala Rajani

    తదుపరి వార్తలు