ఏపీలో విపక్షాలు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయా ? పొలిటికల్‌గా ఆ పార్టీలు బలపడుతున్నాయా ? లేదా అన్నది తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నా.. అధికార పార్టీని టార్గెట్ చేసే విషయంలో విపక్షాలు దూకుడు పెంచాయి. అందులో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన కూడా ఉంది. ఎన్నికలకు వైసీపీ శ్రేణులు, నేతలను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తుండటంతో.. విపక్షాలు కూడా అదే స్థాయిలో సమాయత్తం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ తరువాత జరిగిన మార్పుల కారణంగా కొడాలి నాని, పేర్ని నాని కేబినెట్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. వీరిలో టీడీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే కొడాలి నాని కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు.
ఇటీవల సీఎం జగన్‌తో సమావేశమైన కొడాలి నాని.. టీడీపీని కౌంటర్ చేసే విషయంలో మళ్లీ కీలక పాత్ర పోషించాలని ఆయనకు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని సంగతి ఇలా ఉంటే... మరో మాజీమంత్రి పేర్ని నాని (Perni Nani) కూడా వైసీపీలో సైలెంట్ అయిపోవడంతో.. విపక్షాలను టార్గెట్ చేసే విషయంలో కొంత లోటు కనిపిస్తోంది.
ముఖ్యంగా జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే విషయంలో పేర్ని నాని ప్రముఖ పాత్ర పోషించారనే చెప్పాలి. కొన్నిసార్లు తీవ్రంగా పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన పేర్ని నాని.. మరికొన్ని సందర్భాల్లో ఆయనపై సెటైర్లు వేయడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వైసీపీని, జగన్‌ను విమర్శించినా.. అందుకు కౌంటర్ ఇచ్చేందుకు పేర్ని నాని రంగంలోకి దిగుతుండేవారు. మిగతా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు లాంటి వాళ్ల కంటే ఈ విషయంలో పేర్ని నాని కీలకంగా వ్యవహరించేవారు.
TTD: ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.., భక్తుల తాకిడే కారణం.. పూర్తి వివరాలివే..!
Cyclone Asani: ఈ 12 గంటలకు బీ అలర్ట్.. హుద్ హుద్ తరువాత అంత ప్రమాద హెచ్చరిక ఇదే
అయితే మంత్రిపదవి పోయిన తరువాత పేర్ని నాని సైలెంట్ అయిపోయారు. గతంలో మాదిరి ఆయన పవన్ కళ్యాణ్ కామెంట్స్‌కు పెద్దగా స్పందించడం లేదు. దీంతో వైసీపీ తరపున పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) ధీటుగా కౌంటర్ ఇచ్చే విషయంలో స్పష్టమైన లోటు కనిపిస్తోందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. దీంతో కొడాలి నానితో మాట్లాడిన విధంగానే.. పేర్ని నానిని సైతం సీఎం జగన్(YS Jagan) పిలిచించి మాట్లాడితే ఆయన మరోసారి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Perni nani