హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mudragada Padmanabham: పండుగలకు ఇబ్బంది పెట్టొద్దు.. సీఎం జగన్ కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham: పండుగలకు ఇబ్బంది పెట్టొద్దు.. సీఎం జగన్ కు ముద్రగడ లేఖ

మాజీ మంత్రి, కాపు ఉద్యమంనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కు మరో లేఖ రాశారు. పలు కీలక అంశాలు, ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఉండే ఆయన.. తాజాగా సంక్రాంతి (Sankranthi), ఉగాది (Ugadi) పండుగలపై సీఎంకు లేఖ రాశారు.

ఇంకా చదవండి ...

  మాజీ మంత్రి, కాపు ఉద్యమంనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కు మరో లేఖ రాశారు. పలు కీలక అంశాలు, ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఉండే ఆయన.. తాజాగా సంక్రాంతి (Sankranthi), ఉగాది (Ugadi) పండుగలపై సీఎంకు లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగల సమయంలో కోడి, ఎడ్ల పందేలకు అనుమతులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు తాము ఉత్సాహంగా పండుగలు జరుపుకుంటామని.. ఈ పండుగల సమయంలో పోలీసులు ఇబ్బంది పెట్టకుండా శాశ్వత అనుమతులు ఇవ్వాలని కోరారు. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు కంటే తామ ఉత్సవాలు ప్రమాదకరమైనని కావని ముద్రగడ స్పష్టం చేశారు.

  సీఎంకు రాసిన లేఖలో ముద్రగడ ఏమన్నారంటే.. చాలా సున్నితమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నానమన్న ముద్రగడ.. గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా చాలా ఘనంగా చేయడం ఈ ప్రాంత వాసులకు అలవాటుగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఎడ్లు, గుర్రం, కోడి పందాలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువులు లాగే పందాలు, ఆటల పోటీలు, జాతరలు వగైరాలతో సుమారు 5 రోజులు ఇక్కడ వేడుకలు జరుపుకుంటారని పేర్కొన్నారు. నాకు తెలిసి 1978 నుండి ఇంచుమించుగా 2004 వరకు ఎస్‌ఐ తరువాత డీఎస్పీ ఆ తరువాత ఎస్పీ, ఆ తరువాత ఏలూరు డి.ఐ.జి, ఆఖరిగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రిని పర్మిషన్ అడిగేవాడినని వారు అంగీకరించేవారని ముద్రగడ గుర్తు చేశారు.

  ఇది చదవండి: ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. ఇంటింటి సర్వేకి ప్రభుత్వం సిద్ధం..

  ఈ మధ్య కాలంలో అయితే పండుగల సమయంలో ప్రభుత్వ ఆదేసాలతో పోలీసులు ఇబ్బంది పెట్టడం.., ఆఖరిలో పర్మిషన్ ఇచ్చామని తూతూ మంత్రంగా చేస్తున్నారని ముద్రగడ పేర్కొన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి గమనించాలని సీఎంను కోరారు. కావున ఈ రెండు పండులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదు రోజుల చొప్పున పర్మిషన్ కి పర్మినెంట్ ఆర్డర్స్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పండుగల సమయంలో ప్రజలకు పని ఉండదని.. అందువల్ల ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అంతేకాదు జల్లికట్టు కన్నా ప్రమాదకరమైన ఆటలు, సంబరాలు తమమి కావని.. దయచేసి పండుగల సమయంలో ప్రజలు జైలుకెళ్లే పరిస్థితి రాకుండా చేయాలని ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేశారు.

  ఇది చదవండి: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం స్కెచ్.. ఫైర్ బ్రాండ్ ధైర్యంగా ఎదుర్కొంటారా..?

  గత కొన్నేళ్లుగా సంక్రాంతి సమయంలో కోడిపందేలకు అనుమతుల విషయంలో గందరగోళం నెలకొంటున్న సంగతి తెలిసిందే. జీవహింస, అనుమతుల పేరుతో హడావిడి చేయడంతో సాంప్రదాయంగా వచ్చే కోడిపందేలపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ముద్రగడ లేఖపై సీఎం స్పందిస్తారా.. శాశ్వత అనుమతులిస్తారా..? అనేది వేచి చూడాలి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mudragada Padmanabham

  ఉత్తమ కథలు