Kodali Nani: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Dilhi Liquor Scam).. మొన్నటి వరకు తెలంగాణ (Telangana) రాజకీయాలకే పరిమితం అయిన ఈ ఇష్యూ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నూ వదల్లేదు. ముఖ్యంగా వైసీపీ నేతల చుట్టూ ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన వైసీపీ.. ఎదురుదాడికి దిగింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే అధికారులు తెలంగాణలో సోదాలు, తనిఖీలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ స్కామ్ లో ఫలానా వారు ఉన్నారంటూ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రకంపణలు వచ్చేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) అల్లుడికి ఈ స్కామ్ లో ప్రమేయం ఉందన్న వార్తలు గుప్పుముంటున్నాయి. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఘాటుగా స్పందించారు. లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని తేల్చి చెప్పారు. అరబిందో సంస్థతో సంబంధం లేదని ప్రమాణం చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandraba Naidu) కు సవాల్ విసిరారు.
2004-19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జీవిత కాలం సమయం ఇస్తున్నాన్న కొడాలి నాని… పులివెందులలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలరా అని మండిపడ్డారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని కొడాలి నాని జోస్యం చెప్పారు.
అక్కడితోనే ఆయన ఆగలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని చంద్రబాబుకు అంకితం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం చంద్రబాబు నాయుడి కోసమే పార్టీ పెట్టి.. ఆయనకు పని చేస్తోంది జనసేన అంటూ ఆరోపించారు. పవన్ మాటలను రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా ఇంకా బుద్ధి లేకుండా ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : రేపు విశాఖకు ప్రధాని మోదీ .. రాష్ట్రంలో జాతికి అంకితం చేస్తున్న ప్రాజెక్టులు ఇవే
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్‌బాబును అరెస్టు చేసినట్లు తెలిపాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఆయనను విచారించి, ఇవాళ (గురువారం) ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గతంలో బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Kodali Nani