హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: కేసీఆర్ అందుకే ప్రధాని కావాలనుకుంటున్నారు..? యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani: కేసీఆర్ అందుకే ప్రధాని కావాలనుకుంటున్నారు..? యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

కొడాలి నాని, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Ex Minister Kodali Nani: కేసీఆర్ కొత్త పార్టీపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తొలిసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపైనా స్పందించారు. అలాగే జనసేనకు చిరంజీవి మద్దతుపైనా సంచలన కామెంట్స్ చేశారు.. ఆయన ఏమన్నారంటే?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Kodali Nani on BRS and NTR Health University:  మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minster Kodali Nani) మళ్లీ తనదైన స్టైల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తొలిసారి బీఆరఎస్  పార్టీ (BRS Party), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు (NTR Health University Name Change ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ సీఎంగా కేసీఆర్ (Telangana CM KCR) రెండు సార్లు ఎన్నికయ్యారని.. అందుకే  ఇప్పుడు ప్రధాని అవ్వాలి అనుకుంటున్నారేమో అన్నారు. అలాగే కేసీఆర్ కు ఆంధ్రలో ఆధరణ ఉంటుందో లేదో కాలమే నిర్ణయమిస్తుంది అన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ పై  ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. మనని వెనక్కు పంపారనే భావన ఉందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన తరువాత హైరాబాద్ (Hyderabad) లో ఉన్న సెటిలర్స్ కేసీఆర్ కు అనుకూలంగా  మారారు. మరి ఆ వ్యతిరేకత ఎంత వరకు ఉంటుంది..? ఆయనకు అభ్యర్థులు దొరకుతారో లేదో అప్పుడే చెప్పలేం అన్నారు. చంద్రబాబు వెళ్లి తెలంగాణలో పోటీ చేయడం లేదా అని ప్రశ్నించారు.

ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఆయన తొలిసారి స్పందించారు. పేరు మార్పు సరైంది కాదని నిరాహార దీక్షలు చేసే వారికి తన విన్నపమో.. హెచ్చరికో.. సూచనతో ఏదైనా.. వారు ముందు చేయాల్సింది దీనిపై నిరాహార దీక్షలు కాదన్నారు. ఎన్టీఆర్ పేరు వాడుకుని రాష్ట్రాన్ని పరిపాలించి.. ఆయన రక్త మాంసాలతో రాజకీయాలు చేసిన వారిని తరిమికొట్టాలని కోరుతూ నిరహార దీక్షలు చేయాలి అన్నారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాం.. బొంగరం తిప్పాం అని చెప్పుకునే నేతలు.. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కు భారత రత్నా రాకుండా అడ్డుకున్నారని.. కనీసం ఎన్టీఆర్ కు జిల్లా పేరు కూడా పెట్ట లేకపోయారు. అలాంటి వారిని తరిమికొట్టాలి అంటూ దీక్షలు చేయండి అంటూ సూచించారు. ఎన్టీఆర్ కు కూడు కూడా పెట్టకుండా..? ఆయన పేరుతో రాజకీయాల కోసం అన్న క్యాంటీన్లు పెడుతున్న వారిని ముందు తరిమి కొట్టండి.. ఆ తరువాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు కోసం మ ాట్లాడండి అన్నారు.

ఇదీ చదవండి : పార్టీ కోసం అన్నయ్య ఆస్తులు అమ్మారు.. రాజకీయ పార్టీ నడిపేంత ఆస్తులు తమ్ముడికి ఉన్నాయా? పవన్ ఆస్తుల విలువ ఎంత?

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కు చిరంజీవి మద్దతు ఇస్తాను అన్న వ్యాఖ్యలపైనా స్పందించారు. అయితే అసవరం అనుకుంటే మద్దతు ఇస్తానని చిరంజీవి అన్నారని.. కానీ పవన్ కు చిరంజీవి అవసరం లేదని.. ఆయనక్నా ఈయన పెద్ద స్టార్ అంటూ సెటైర్లు వేశారు. అయితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అయిన చంద్రబాబు పవన్ వెనుక ఉన్నప్పుడు చిరంజీవి అవసరం పవన్ కు ఏముంటుంది అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, KCR New Party, Kodali Nani

ఉత్తమ కథలు